Home » ఎనిమిదేళ్ల త‌రువాత గూగుల్ లోగో మార్పు..!

ఎనిమిదేళ్ల త‌రువాత గూగుల్ లోగో మార్పు..!

by Anji
Ad

ఇంటర్‌నెట్ అన‌గానే తొలుత గుర్తుకు వ‌చ్చేది గూగుల్‌. ఇంట‌ర్‌నెట్ క‌నెక్ష‌న్ ఉందో లేదో చెక్ చేయ‌డానికి కూడా యూఆర్ఎల్‌లో గూగుల్‌ను టైప్ చేసి చెక్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఎన్నో ర‌క‌ర‌కాల వెబ్ బ్రౌజ‌ర్లు అందుబాటులో ఉన్నా చాలా మందికి మాత్రం తెలిసింది గూగుల్‌. అంత‌లా పాపుల‌ర్ అయింది సెర్చ్ ఇంజ‌న్‌. ఇక గూగుల్ అన‌గానే రౌండ్‌షేప్‌లో ఉండే ఆకారం గుర్తుకొస్తుంది. అదే గూగుల్ లోగో అడ‌పాద‌డ‌పా గూగుల్ ఈ లోగోలో మార్పులు చేస్తుంటుంది. ఈ త‌రుణంలోనే తాజాగా మ‌రొక‌సారి గూగుల్ లోలో మార్పు చేసింది.

Advertisement

2014 త‌రువాత గూగుల్ మ‌రొక‌సారి లోగోను మార్పులు చేసింది. లోగోను గూగుల్ క్రోమ్ డిజైన‌ర్ ఎల్విన్ హు క్రో ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశారు. క్రోమ్ కొత్త ఐకాన్‌ను ఇవాళ గ‌మ‌నించే ఉంటారు. 8 ఏళ్ల త‌రువాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్ ను రిప్రెష్ చేస్తున్నాం అని పోస్ట్ చేశారు. గూగుల్ ఈ లోగోలో కేవలం స్వ‌ల్ప మార్పులు మాత్ర‌మే చేసింది. పాత లోగోకు కొత్త లోగోకు స్వ‌ల్ప తేడాలు క‌నిపిస్తున్నాయి. లోగోలో ఉండే రెడ్, గ్రీన్ య‌ల్లో క‌ల‌ర్స్‌ను కాస్త బ్రైట్ గా మార్చారు. అదేవిధంగా మ‌ధ్య‌లో ఉండే బ్లూ క‌ల‌ర్‌ను పెద్ద‌గా చేసి దానిని కూడా బ్రైట్ చేశారు.

Advertisement

తొలుత గూగుల్ 2008లో మార్పులు చేసింది. ఈ త‌రువాత 2011లో మ‌ర‌ల మూడేండ్ల‌కు 2014లో లోగోను మార్పులు చేసింది. 2014 నుంచి 2022 వ‌ర‌కు ఎలాంటి మార్పులు చేయ‌లేదు. తాజాగా గూగుల్ చేసిన ఈ మార్పుల‌పై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. లోగో మార్పు అంటే ఇదేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇందుకు కార‌ణం క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే కాని లోగోలో చేసిన మార్పులు క‌నిపించ‌క‌పోవ‌డమే. ప‌లు ఫ‌న్నీ మీమ్స్‌తో సోష‌ల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న ఫ‌న్నీ మీమ్స్‌ను చూసేయండి.

Also Read  :  మ‌రొక వివాదంలో అల్లుఅర్జున్‌.. సెటైర్ మిస్ ఫైర్

Visitors Are Also Reading