Home » పది రోజుల షూటింగ్ తరువాత సినిమా మొత్తం ఆపేయాలనుకున్న రాజమౌళి సినిమా ఎదో తెలుసా ?

పది రోజుల షూటింగ్ తరువాత సినిమా మొత్తం ఆపేయాలనుకున్న రాజమౌళి సినిమా ఎదో తెలుసా ?

by AJAY
Ad

సినిమా ఏదైనా హీరో ఎవ‌రైనా జ‌క్క‌న్న డైరెక్ష‌న్ అంటే మాత్రం ఆ సినిమా ప‌ట్టాలెక్క‌క‌ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని అభిమానులు ఫిక్స్ అయిపోతారు. ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఏ సినిమా కూడా ప్లాప్ అవ్వ‌లేదు. అంతే కాకుండా జ‌క్క‌న్న ప్రారంభించిన ఏ సినిమా కూడా మ‌ధ్య‌లో ఆగిపోలేదు. అయితే జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా ఈగ సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌క్షులు , జంతువుల పై సినిమాలు వ‌చ్చాయి హిట్ అందుకున్నాయి కానీ ఒక కీట‌కం పై సినిమా వ‌చ్చిన ఘ‌న‌త మాత్రం జ‌క్క‌న్నకే ద‌క్కింది.

Also Read: హీరో విక్రమ్ కి ఏమైంది.. హై ఫీవరా..? గుండె పోటా..?

Advertisement

ఈగ సినిమాలో నాని మ‌ళ్లీ జ‌న్మించ‌డం విల‌న్ పై రివేంజ్ తీర్చుకోవ‌డం ఉంటుంది. ఇక ఈ సినిమాకు కూడా ర‌చ‌యిత రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. నిజానికి ఈ సినిమా క‌థ‌ను వివ‌రించేటప్పుడు విజ‌యేంద్ర‌ప్రసాద్ కూడా జోక్ గా చెప్పార‌ట‌. ఈగ రివేంజ్ తీర్చుకుంటుంది అని చెప్ప‌డం జోక్ గా అనిపించింద‌ట‌. కానీ క‌థ జ‌క్క‌న్న కు న‌చ్చ‌డంతో ఆయ‌న నాని హీరోగా షూటింగ్ ప్రారంభించారు.

Advertisement

Also Read: ఎన్టీఆర్ చాలా ఇష్ట‌ప‌డే వెజ్ వంట‌కం ఇదే.. ఆ హీరోయిన్ల‌కు కూడా రుచి చూపించేవార‌ట‌..!

ఈ సినిమాలో స‌మంత‌ను హీరోయిన్ గా తీసుకున్నారు. అంతే కాకుండా క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుధీప్ ను విల‌న్ గా ఎంపిక చేశాడు. అలా జ‌క్క‌న్న సినిమాను ప్రారంభించాడు. సినిమా షూటింగ్ ప్రారంభించి స‌రిగ్గా ప‌దిరోజులు అయ్యింది. ఇక ఈగ‌తో సినిమా అంటే పూర్తిగా వీఎఫ్ఎక్స్ ను న‌మ్ముకోవాల్సిందే అన్న సంగ‌తి తెలిసిందే.

అయితే ముక్త వాళ్లు అందించిన వీఎఫ్ఎక్స్ ప‌ది రోజుల షూటింగ్ త‌ర‌వాత రాజ‌మౌళికి న‌చ్చ‌లేద‌ట‌. దాంతో విసుగు పుట్టి సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేయాల‌ని నిర్ణయం తీసుకున్నార‌ట‌. మ‌ళ్లీ త‌ర‌వాత నిర్ణ‌యం మార్చుకుని షూటింగ్ ను కంటిన్యూ చేశారట‌. ఇక ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రం తెలుగు కంటే ఇత‌ర భాష‌ల్లో మంచి విజ‌యం సాధించింది.

ALSO READ : ఎన్టీఆర్ చాలా ఇష్ట‌ప‌డే వెజ్ వంట‌కం ఇదే.. ఆ హీరోయిన్ల‌కు కూడా రుచి చూపించేవార‌ట‌..!

Visitors Are Also Reading