సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు కాస్త చనువుగా ఉన్నారంటే చాలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తాయి. డేటింగ్ చేస్తున్నారంటూ ప్రేక్షకులు చెవులు కొరుక్కుంటారు. ఇక డిన్నర్ లు పార్టీలు అంటే రచ్చ రచ్చ అయిపోతుంది. ఇప్పుడు సిద్దార్థ్ అధితి రావు హైదరీల మ్యాటర్ కూడా అలానే ఉంది. సిద్దార్థ్ అదితి రావు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు.
Advertisement
ALSO READ :మోహన్ బాబు పవన్ కల్యాణ్ మధ్య బాక్సాఫీస్ యుద్దం…ఇద్దరిలో ఎవరు గెలిచారంటే..?
ఈ సినిమా సమయంలో ఇద్దరూ క్లోజ్ అయ్యారు. ఆ తరవాత ఈ జంట ముంబై లో చెక్కర్లు కొడుతూ మీడియాకు చిక్కారు. ఆ సమయంలో ఫుటేజ్ బయటకు రాకూడదంటూ సిద్దార్థ్ మీడియాను సైతం బెదిరించాడు. ఆ తరవాత కూడా ఇద్దరూ కలిసి మీడియా కంటపడ్డారు. దాంతో ఇద్దరి వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి.
Advertisement
ఇదిలా ఉంటే తాజాగా అదితిరావును మీడియా నేరుగా ప్రశ్నించింది. సిద్దార్థ్ తో రిలేషన్ షిప్ పై స్పందించాలని కోరింది. దానికి అదితి సమాధానం ఇస్తూ…ప్రతిఒక్కరికీ ఏదో ఒక అంశం పై ఆసక్తి ఉంటుందని చెప్పింది. కొందరికి ఇలాంటి వాటిపై ఉండొచ్చని చెప్పింది. కానీ చాలా మందికి మేం స్క్రీన్ పై నటించడం అంటే ఇష్టం అందుకోసం మేం మరింత కష్టపడాలి అంటూ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో మీకే ఓ అభిప్రాయం ఉంది ఇంకా నేనేం చెప్పాలి. ఒకవేళ నేను చెప్పినా మీకు నచ్చింది ఊహించుకుంటారు అంటూ వ్యాఖ్యానించింది.
Advertisement
ALSO READ : ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసిన హీరో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?