Home » పాట్నా నిట్ విద్యార్థికి ఫేస్ బుక్ అదిరిపోయే ఆఫ‌ర్….1.6 కోట్ల ప్యాకేజీతో..!

పాట్నా నిట్ విద్యార్థికి ఫేస్ బుక్ అదిరిపోయే ఆఫ‌ర్….1.6 కోట్ల ప్యాకేజీతో..!

by AJAY
Ad

టాలెంట్ ఉండాలే గానీ ఉద్యోగాలు వెతుక్కుంటూ వ‌స్తాయి. ప్ర‌తిభ చూపిస్తే చాలా కోట్ల ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తాజాగా ఓ విద్యార్థిని ఫేస్ బుక్ ఏకంగా 1.6 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం క‌ల్పించింది. పాట్నా నిట్ విద్యార్థినికి ఈ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ లో ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థిని ఆదితి తివారీకి ఫేస్ బుక్ సంస్థ‌లో ఉద్యోగం వ‌చ్చింది. ఆదితి తండ్రి పాట్నా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తుండ‌గా ఆమె త‌ల్లి ప్ర‌భుత్వ ఉపాద్యాయినిగా ప‌నిచేస్తుంది. ప్ర‌స్తుతం వీరి కుటుంబం జంషెడ్ పూర్ లో నివాసం ఉంటోంది.

Advertisement

Advertisement

ఇక ఆదితికి ఫైన‌ల్ ఇయ‌ర్ లోనే మంచి ఉద్యోగం రావ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా పాట్నా నిట్ నుండి ఐదేళ్ల క్రితం ఓ విద్యార్థికి రూ.50 నుండి రూ.60 ల‌క్ష‌ల ప్యాకేజీతో ఉద్యోగం వ‌చ్చింది. ఇక మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర‌వాత నిట్ లో ఆదితికి కోట్ల ఆఫ‌ర్ రావ‌డంతో స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దాంతో ప్ర‌తి ఒక్క‌రూ ఆదితిని ప్ర‌శంసిస్తున్నారు.

Visitors Are Also Reading