హిందూ మతంలో అధికమాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిందని విశ్వసిస్తారు. అయితే.. ఈ మాసంలో వచ్చే అమావాస్యని అధికమాసం అమావాస్య అంటారు. ఈ రోజు చాలా విశిష్టమైనది. ఈరోజు దానం చేసినా, స్నానం చేసినా దానికి చాలా విశిష్ట ఫలితం లభిస్తుంది. అమావాస్య రోజు చేసే శ్రాద్ధ కర్మలకు, తర్పణం, దానాలకు పూర్వికులు తృప్తి పడతారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 16న అధికమాసం అమావాస్య వస్తోంది.
Advertisement
అధిక మాసంలో వచ్చే అమావాస్యకి మరింత ప్రాధాన్యత ఉంది. ఈరోజు చేసే శ్రాద్ధ కర్మలకు, తర్పణం, దానాలకు మరింత ప్రాధాన్యత దక్కనుంది. ఇతర నెలవారీ అమావాస్యల కంటే అధిక మాసంలో వచ్చే అమావాస్యకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజున ఏమేమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకుందాం. బుధవారం రోజున అధిక మాసం అమావాస్య వచ్చింది. కాబట్టి తొలుత గణేశుని పూజించి, ఆ తరువాత ఇష్టదైవారాధన చేయండి.
Advertisement
అలాగే, శక్తిమేర పూర్వీకుల సంతృప్తి కోసం అన్న దానం చేయడం మంచిది. ఎవరికైనా మినుములు, బెల్లం, నెయ్యి సమర్పించి పూర్వీకులను తలుచుకుని ధ్యానం చేయండి. ఆగష్టు 16 వ తేదీతో అధికమాసం పూర్తి అవుతుంది. ఈరోజున అన్నదానం చేయడం, శివ విష్ణు పురాణం చదవడం మంచిది. అలాగే.. ఈరోజున ఆలస్యంగా నిద్ర లేవడం మంచిది కాదు. తెల్లవారు జామున నిద్ర లేచి నియమ నిబంధనల ప్రకారం పూజ చేయండి. అలాగే అమావాస్య రోజు చీపిరి కొనడం మంచిది కాదు. లక్ష్మి దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అమావాస్య ఘడియల్లో మత్తు పదార్ధాలు, మాంసాహారం ముట్టడం కూడా మంచిది కాదు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్.. ఈ లుక్ ఎవరిది? అనసూయ ఇలా ఎందుకు కనిపిస్తోంది?