Home » హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న టాలీవుడ్ స్టార్…!

హీరోయిన్ తో పెళ్లికి రెడీ అవుతున్న టాలీవుడ్ స్టార్…!

by AJAY
Ad

హీరోగా, విలన్ గా నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో ఆది పినిశెట్టి. తెలుగులోనే కాకుండా తమిళ్ లోనూ ఆది పినిశెట్టి కి అభిమానులు ఉన్నారు. నిజానికి ఈ హీరో అక్కడ ఇక్కడ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడి కుమారుడిగా ఆది పినిశెట్టి సినిమాలకు పరిచయం అయ్యాడు.

Advertisement

ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మెప్పించగా టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమా విలన్ గా నటించారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఆది పినిశెట్టి నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత చాలానే విలన్ ఆఫర్స్ వచ్చాయి కానీ తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే ఆది ఆ సినిమాలో నటిస్తాడు.

Advertisement

 

ఇదిలా ఉండగా ఆది గత కొద్ది రోజులుగా హీరోయిన్ నిక్కి గల్రానితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి నిక్కి గల్రాని తో మలుపు, మరకతమణి సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాల షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

 

అంతే కాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆది సన్నిహితుడు ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు. కొద్ది రోజుల్లోనే వీళ్ళ ఎంగేజ్ మెంట్ జరగనుందట. ఇక ఇప్పటికే నిక్కి ఆది ఫ్యామిలీ తో కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading