Home » స్టార్ డైరెక్టర్ల మీద ఆధారపడకుండా.. శేష్ తాను సొంతంగా ఎందుకు స్టోరీస్ రాసుకుంటారంటే ?

స్టార్ డైరెక్టర్ల మీద ఆధారపడకుండా.. శేష్ తాను సొంతంగా ఎందుకు స్టోరీస్ రాసుకుంటారంటే ?

by AJAY
Ad

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. అయితే హీరోగా న‌టించడంతో పాటూ డైరెక్ష‌న్ లో…క‌థలు రాయ‌డంలో ప‌ట్టు ఉన్న‌వాళ్లు మాత్రం కొద్ది మంది మాత్ర‌మే ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ హీరోల‌లో అడవిశెషు కూడా ఒక‌రు. డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాల‌కు అడ‌వి శేషు పెట్టింది పేరు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో న‌టించి అడవిశేషు ప్ర‌స్తుతం బిజీ హీరోగా మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న‌చిన్న‌పాత్ర‌లు చేసి ఆ త‌ర‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయ్యాడు.

Advertisement

అడ‌విశేషు న‌టించిన క్ష‌ణం సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన త‌ర‌వాత అడ‌విశేషుకు వ‌రుస ఆఫ‌ర్ లు వ‌చ్చాయి. నిజానికిఈ సినిమాకు క‌థ‌ను రాసుకుంది కూడా అడ‌విశేషునే కావ‌డం విశేషం. ఈ సినిమా త‌ర‌వాత త‌ను ఆరు సినిమాల్లో న‌టించ‌గా అందులో నాలుగు సినిమాల‌కు తానే క‌థ‌ల‌ను రాసుకున్నాడు.

Advertisement

ఇటీవ‌లే హిట్ 2, మేజ‌ర్ సినిమాల‌తో శేషు సూప‌ర్ హిట్ లు అందుకున్నాడు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అడ‌విశేషు ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశాడు.త‌న క‌థ‌ల‌ను తానే రాసుకోవ‌డానికి కార‌ణం ఏంటో వివ‌రించాడు. నా ఆరు సినిమాల‌లో నాలుగు సినిమాల‌కు నేనే క‌థ‌ను రాసుకున్నాను….కొన్నింటికి ఆ సినిమా ద‌ర్శ‌కుడితో క‌లిసి స్క్రిప్ట్ వ‌ర్క్ లో ప‌నిచేశాను.

తెలుగు సినిమాల్లో ఒకే ఫ్యామిలీ నుండి ప‌దిమంది హీరోలు ఉన్నారు. కాబ‌ట్టి నేను చాయిస్ నంబ‌ర్ 53 కింద‌కి వ‌స్తాను. ఇక్క‌డ కేవ‌లం 20 స్క్రిప్ట్ లు మాత్ర‌మే ఉన్నాయి. కాబ‌ట్టి నాకు హీరోకు నాలుగో ఫ్రెండ్ గా చేయ‌డానికి అవ‌కాశాలు వ‌స్తాయి. కానీ హీరోగా అవ‌కాశాలు రావ‌డం కంష్టం. అందువ‌ల్లే నేను సొంతంగా స్క్రిప్ట్ లు రాయ‌డం ప్రారంభించుకున్నాను. అంటూ అడ‌విశేషు కామెంట్ లు చేశాడు.

Visitors Are Also Reading