ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నంబర్ వన్ స్థానంలో నిలిచి గౌతమ్ అదానీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల అంబానీ ఆదిపత్యాన్ని ఆధిపత్యానికి గండికొట్టారు. ఇప్పటివరకూ దేశంలోనే కాక ఆసియా ఖండంలోనే అంబానీ అపరకుబేరుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆసియాలో తాను నంబర్ వన్ స్థానానికి వచ్చి రిలయన్స్ అధినేత అంబానీని అదానీ వెనక్కి నెట్టారు. గ్లోబల్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ సంపద ఇప్పుడు 88.8 బిలియన్లు డాలర్లుగా ఉంది. ఇక అంబానీ సంపద 90 బిలియన్లు డాలర్లుగా ఉంది.
Advertisement
ఈ డేటా తరవాత రిలయన్స్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దాంతో అదానీ ముందుకు వచ్చారు. ఇక ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన అదానీ తన జీవితంలో రెండు సార్లు చావు నుండి బయటపడ్డారట. ఓసారి టీనేజ్ లో ఉన్నప్పుడు అదానిని కిడ్నాప్ చేసి దుండగులు హత్య చేయాలని చూశారట. కానీ దుండగుల నుండి అదానీ తప్పించుకున్నాడట. వజ్రాల వ్యాపారం చేస్తున్న సమయంలో అతడు ముంబైకి రాగా ఈ ఘటన చోటు చేసుకుంది. 2008 నవంబర్ 26న తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ టెర్రరిస్ట్ ల దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కాల్పులు జరుగుతున్న సమయంలో అదానీ హోటల్ భోజనం చేస్తున్నారు. అప్పటికే 160 మందిని టెర్రరిస్ట్ లు పొట్టన పెట్టుకున్నారు. టెర్రరిస్ట్ లు కాల్పులు జరుపుతున్న సమంయలో అదానీ కల్లారా చూసారు కూడా. కాగా ఈ దాడుల నుండి కూడా అదానీ ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని బయటపడ్డారు. కమాండోలు టెర్రరిస్ట్ లను చుట్టుముట్టిన తరవాత అదానీ తాజ్ హోటల్ నుండి బయటపడ్డారు.