Home » The Kerala Story : ఆదాశర్మ ఫోన్ నంబర్ లీక్.. ఫోన్ చేసి బూతులు!

The Kerala Story : ఆదాశర్మ ఫోన్ నంబర్ లీక్.. ఫోన్ చేసి బూతులు!

by Bunty
Ad

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీ సినిమా ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ… కీలక పాత్ర చేసిన ఈ సినిమా నెల రోజుల కిందట రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వివాదం లోనే ఈ సినిమా కొనసాగుతోంది. కేరళ రాష్ట్రం తో పాటు పలు సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలోనూ కేరళ స్టోరీ సినిమాపై ఆంక్షలు విధించారు.

Advertisement

అయినప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్ల తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్లు దాటినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ తరుణంలోనే ఈ సినిమాలో నటించిన ఆదాశర్మకు సోషల్ మీడియాలో ఘోర అవమానం ఎదురయింది. ఆదాశర్మ పర్సనల్ నెంబర్ను సోషల్ మీడియా యూజర్ వైరల్ చేశాడు. దాంతో ఆ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంకేముంది ఆదాశర్మ కు ఫోన్ చేసి కొంతమంది బెదిరిస్తున్నారని సమాచారం.

Advertisement

ఇలాంటి సినిమాలు చేస్తావా.. అని ఫైర్ అవుతున్నారట. ఇక ఆమె నెంబర్ వైరల్ చేసిన వ్యక్తి… తన అకౌంట్ ను బ్లాక్ కూడా చేశాడట. అంతేకాదు ఆదాశర్మ వాడే ప్రతి నెంబర్ ను సోషల్ మీడియాలో పెడతానని సదరు యూజర్ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాడట. అయితే ఈ విషయం తెలిసిన ఆదాశర్మ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్ అలాగే మన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఆ నిందితుడిపై ఆదాశర్మ ఫాన్స్ కేసులు పెట్టారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…

IPL 2023 : ముంబైని గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కు పంత్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

Visitors Are Also Reading