Home » టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి విజ‌య కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఏం చేస్తుందంటే..?

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి విజ‌య కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఏం చేస్తుందంటే..?

by AJAY

టాలీవుడ్ లో న‌టి వై విజ‌య అంటే ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉండే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల‌లో విజ‌య కూడా ఒక‌రు. రీసెంట్ గా ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల‌లో త‌మ‌న్నాకు భామ్మ పాత్ర‌లో న‌టించి త‌న న‌ట‌న‌తో విజ‌య న‌వ్వులు పూయించారు. ఇక‌ ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన విజ‌య ఆ త‌ర‌వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. త‌ల్లి, అత్త లాంటి పాత్ర‌లు చేసి ఇప్పుడు భామ్మ పాత్ర‌ల‌లో సైతం న‌టిస్తున్నారు.

అంతే కాకుండా ఒక‌ప్పుడు లేడీ విల‌న్ గా కూడా విజ‌య మంచి పేరు సంపాదించుకున్నారు. శ్రీకృష్ణ సినిమాతో హీరోయిన్ గా విజ‌య త‌న కెరీర్ ను ప్రారంభించారు. అంతే కాకుండా యైటీస్ లోనే విజ‌య వెయ్యికి పైగా సినిమాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. కాగా ప్ర‌స్తుతం విజ‌య ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. విజ‌య తండ్రి బ్యాంకు మేనేజ‌ర్ గా ప‌నిచేసేవార‌ట‌. కాగా చిన్న‌తనంలోనే ఆమెకు సినిమాలపై ఆస‌క్తి ఉండ‌టంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఆ త‌ర‌వాత వ‌రుస‌గా తెలుగు, త‌మిళ చిత్రాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. అంతే కాకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే 1985 వ సంవ‌త్స‌రంలో అమ‌ల‌నాథ్ అనే వ్య‌క్తిని విజ‌య పెళ్లి చేసుకున్నారు.వీరికి అనుష్క అనే కూతురు కూడా ఉన్నారు. అయితే విజ‌య తన కూతురు అందంగా ఉన్న‌ప్ప‌టికీ సినిమాల్లోకి తీసుకురాలేదు. కాగా తాజాగా విజ‌య కూతురు ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో ఆమె అందం చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. సినిమాల్లోకి వ‌చ్చి ఉంటే అవ‌కాశాలు వ‌చ్చేవని కామెంట్స్ పెడుతున్నారు.

Visitors Are Also Reading