Home » నాగార్జునతో ఎఫైర్ పై నోరు విప్పిన టబు..!

నాగార్జునతో ఎఫైర్ పై నోరు విప్పిన టబు..!

by Azhar
Ad
సినిమా ప్రపంచంలో చాలా మందికి మధ్య ఏమో జరుగుతుంది అనే వార్తలు వస్తూనే ఉంటాయి. ఇవి ఇప్పట్లో కామన్ కావచ్చు. కానీ గతంలో మాత్రం చాలా సీరియస్ గా తీసుకునేవారు. అయితే ఇలాంటి వార్తలు ఎక్కువగా నాగార్జున గురించే వచ్చేవి. ఎందుకంటే ఆయన తీసే సీనియాలు అలానే ఉండేవి కాబట్టి. టాలీవుడ్ లో లవర్ బాయ్ గా అలాగే మన్మథుడిగా గుర్తింపు తెచుకున్న నాగార్జున ప్రేమకు సంబంధించిన చాలా సినిమాలు తీసాడు. అందుకే ఆయన పైన రూమర్స్ వచ్చేవి.
అయితే మన ప్రేమదేశం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా వచ్చింది టబు. అప్పట్లో నాగార్జున, టబు కలిసి చేసిన మొదటి సినిమా నిన్నే పెళ్లాడుతా. ఇందులో వీరిద్దరికి మధ్య రొమాన్స్ బాగా కుదిరింది. అందుకే వీరి మధ్య ఏదో జరుగుతుంది.. వీరికి ఎఫైర్ ఉంది అనే వార్తలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత బాలీవుడ్ కు టబు వెళ్లిన తర్వాత ఇవి కొంచెం తక్కువయ్యాయి. కానీ ఈ మధ్య టబు మళ్ళీ ఎక్కువగా హైదరాబాద్ వస్తుండటంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి.
ఇప్పటికి టబు పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే కారణం అంటుంటారు. అయితే ఈ మధ్య ఇక్కడికి వచ్చిన టబును నాగార్జునతో ఎఫైర్ గురించి ప్రశ్నించగా సమాధానం చెబుతూ.. నేను, నాగార్జున మంచి మిత్రులం మాత్రమే. అంతకు మించి మా మధ్యలో ఏం లేదు. ఇక ఇప్పుడు హైదరాబాద్ కు పదే పదే రావడనికి కారణం.. నేను ఇక్కడ ఇల్లు కొనడమే అని తెలిపింది. అయితే బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసిన టబు నెగెటివ్ ప్లేస్ మాత్రం హైదరాబాదే.

Advertisement

Visitors Are Also Reading