Home » సుంద‌రం మాస్టార్ దారుణంగా అవ‌మానించారు..న‌టి ఎమోష‌న‌ల్..!

సుంద‌రం మాస్టార్ దారుణంగా అవ‌మానించారు..న‌టి ఎమోష‌న‌ల్..!

by AJAY
Published: Last Updated on
Ad

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ హీరోయిన్ సుధ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ పై సుధా సంచలన ఆరోపణలు చేశారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో సుందరం మాస్టర్ త‌న‌ను దారుణంగా అవమానించారని సుధ వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ…. తమిళ్ లో ఓ సినిమా పాటను చిత్రీకరిస్తున్నారు..ఆ సమయంలో సుందరం మాస్టర్ తనకు డాన్స్ స్టెప్పులు చెబుతున్నారని అయితే అవి తనకు అర్థం కాకపోవడం తో నాలుగైదుకు పైగా టేకులు తీసుకున్నాన‌ని తెలిపింది.

charecter artist sudha emotional

Advertisement

దాంతో ఆయన తనపై కోప్పడుతూ అందరిముందే అవ‌మానించార‌ని తెలిపింది. నువ్వు వ్యభిచారానికి కూడా పనికి రావు అంటూ దారుణంగా అవమానించారని కామెంట్స్ చేసింది. దాంతో ఆ మాటలను తాను భరించలేకపోయాన‌ని చెప్పింది. షూటింగ్ స్పాట్ లో ప్రభు, సహా మరికొంత మంది పెద్దలు కూడా ఉన్నారని చెప్పింది. దాంతో ఏడుస్తూ ఇంటికి వెళ్లాన‌ని ఈ విషయం తన తల్లికి చెప్పి బాధ పడ్డాన‌ని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న, పెద్ద ఆర్టిస్ట్ ల‌ను నటీనటులను అలా అనడం తప్పని ఆయన నాపై వాడకూడని భాషను వాడారని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

దాంతో సుందరం మాస్టర్ సినిమాలో ఇకపై నటించకూడదని తాను నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఒకరోజు సుందరం మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తనకు తల్లి పాత్ర ఇచ్చారని చెప్పింది. అందుకోసం సుందరం మాస్టర్ తనను కలిశారని ఆయనను చూడగానే సినిమా చేయనని చెప్పినట్టు తెలిపింది.

కానీ ఆయన తాను అన్న మాటలకు క్షమాపణ చెప్పార‌ని తెలిపింది. దాంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పానని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో ఒకే టేక్ లో రెండు పేజీల డైలాగ్ ను చెప్పానని తెలిపింది. దాంతో సుంద‌రం మాస్ట‌ర్ త‌న దగ్గరకు వచ్చి అందరి ముందు మళ్ళీ క్షమాపణలు చెప్పారని వ్యాఖ్యానించింది.

Also Read: ఆ పాట కోసం….104 డిగ్రీల జ్వ‌రంతో చిరు డాన్స్!

Visitors Are Also Reading