భరతనాట్యం కళాకారణిగా తన అద్భుతమైన ప్రతిభతో పలు ప్రదర్శనలు ఇచ్చిన శోభన.. 1984 సంవత్సరంలో శ్రీమతి కానుక సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా సుమన్ హీరోగా చేసారు. ఆ తరువాత నాగార్జున విక్రమ్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. చిరంజీవితో రౌడి అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమమురారి మోహన్ బాబు తో అల్లుడు గారు, రాజేంద్రప్రసాద్‌తో అప్పుల అప్పారావు లాంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ మీరోయిన్ అనిపించుకున్నది. వీటితో పాటు అభినందన, రుద్రవీణ రక్షణ వంటి చిత్రాల్లో శోభన నటించింది.
Also Read:గొంతులో బుల్లెట్ దిగిన వ్యక్తిని కాపాడిన హీరో రాజశేఖర్…అప్పట్లో సెన్సేషనల్ న్యూస్.!
Advertisement
తెలుగు, మలయాళం, తమిళం, హిందీ చిత్రాలలో నటించింది. చంద్రముఖి చిత్రానికి మూలం అయిన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి పలు అవార్డును దక్కించుకుంది శోభన. అదేవిధంగా ఆమెను నాట్యమయూరి అని తెలుగు వారు పిలుచుకుంటుంటారు. తెలుగు వారింటి ఆడపడుచుగా కనిపించే శోభన వాస్తవానికి మలయాళ నటి. తెలుగు వారు అని పిలుచుకుంటారు. నాట్యం, నటన రంగాలలో తమ ప్రతిభను చూపించిన పద్మని, లలిత, రాగిణిల మేడకోడలే శోభన. 1994లో ఆమె శోభన కళార్పణ అనే సంస్థను స్థాపించి అప్పటి నుంచి విస్తరిస్తోంది. ఎందరో కళాకారినులు ఆమె వద్ద నాట్యం నేర్చుకుంటున్నారు.
Advertisement
చాలా మంది తెలుగువారికి మలయాళీ అన్న సంగతే తెలియదు. అంతగా ఆమె తెలుగువారితో కలిసిపోయింది. ఆమెకు 50 సంవత్సరాలు వస్తున్నా.. ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. శోభన వద్ద ప్రస్తావించగా.. హీరోయిన్ గా ఉన్న సమయంలో ఓ మలయాళ హీరోను ప్రేమించాను అని.. ఆ హీరో మోసం చేయడంతో జీవితంలో ప్రేమకు పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు శోభన తెలిపారు. చిన్నారిని దత్తత తీసుకుని ఆమె అన్నీ తానై చూసుకుంటుంది. ఆమె నాట్యమే ఆమె లోకం. చిన్నారిని దత్తత తీసుకుని ఆమె ఆలనా, పాలన చూసుకుంటోంది. ప్రస్తుతం ఆమె నాట్యమే ఆమె లోకం. ఓ సినిమాలో శోభన అతిథి పాత్రను పోషించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హరోగా నటించారు. ముందుకు సాగుతున్న నటి శోభన జీవితంలో ఎన్నో విజయాలను అందుకోవాలని మనం కోరుతుంది.
Also Read: బుల్లి తెరపై కరోనా విజృంభణ… బిగ్ బాస్ సరయు, కౌశల్ లకు కరోనా పాజిటివ్..!