Home » Samantha : అందం తగ్గిందని నెటిజన్‌ కామెంట్‌.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సమంత

Samantha : అందం తగ్గిందని నెటిజన్‌ కామెంట్‌.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సమంత

by Bunty
Ad

సమంత, గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా విడుదలైన యశోద వరకు ఎక్కడ కూడా విరామం తీసుకోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది సామ్. దీనిపై ఆమె ఇటీవల ప్రకటించింది.

Advertisement

ఇక సోమవారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత నటించిన ‘శాకుంతలం’ ట్రైలర్ విడుదల అయింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ తో పాటు సమంత కూడా ఎమోషన్ అయ్యారు. గుణశేఖర్ కంటతడి పెట్టుకోగా, సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం సమంత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కేవలం ఈ వీడియోపైనే కాదు, ఆమె శరీరంలో వచ్చిన మార్పుల గురించి కూడా నెట్టింట కామెంట్లు రావటం మొదలయ్యాయి.

Advertisement

బజ్ బాస్కెట్ అనే ట్విట్టర్ ఖాతా ఈ విధంగా రాసుకొచ్చింది. “సమంతను చూస్తే జాలేస్తోంది. ఆమె తన అందాన్ని కోల్పోయింది. ఆమె విడాకుల నుంచి బయటపడి, వృత్తిలో ఎదుగుతుందని అనుకుంటున్న సమయంలో మయోసైటిస్ ఆమెపై దారుణంగా దాడి చేసింది. ఆమెను మరోసారి బలహీనురాలిని చేసింది” అని అంది. ఈ పోస్ట్ పై సమంత స్పందించారు. ఆమె తన ట్వీట్ లో, “నాలాగా మీరు నెలల పాటు చికిత్స, మందులపాలు కాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా. మీరు బాగుండాలని కోరుకుంటూ నా వైపు నుంచి కొంత ప్రేమను పంపిస్తున్నా” అని పేర్కొన్నారు. సమంత ఇచ్చిన రిప్లైకి ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.

READ ALSO : కిరాక్ ఆర్పీ చేపల పులుసు కర్రీ పాయింట్ రీ ఓపెన్

 

Visitors Are Also Reading