టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రాణించిన వారిలో ఆర్కే రోజా కూడా ఒకరు. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన రోజా సినిమాలు చేశారు. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోయిన్ గా గుడ్ బై చెప్పిన తర్వాత రోజా సినిమాల్లో ఇతర ముఖ్యమైన పాత్రలోనూ నటించి అలరించారు. ఇక సినిమాలు ఒక ఎత్తు అయితే రోజా జబర్దస్త్ కామెడీ షో ద్వారా కూడా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నారు.
Advertisement
Roja
ఈ కామెడీ షోలో జడ్జిగా చాలా ఏళ్లపాటు వ్యవహరించి అభిమానులను సంపాదించుకున్నారు. ఓవైపు జబర్దస్త్ లో జడ్జ్ గా వ్యవహరిస్తునే మరోవైపు ఏపీ రాజకీయాల్లోనూ రాణించారు. మొదట ఎమ్మెల్యేగా సేవలు అందించిన రోజా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. సినిమాల్లో ఎంత సక్సెస్ అయ్యారో రాజకీయాల్లోనూ అంతే సక్సెస్ అయ్యారు. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పిస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు.
Advertisement
ఇక చాలాకాలం పాటు స్టార్ హీరోయిన్ గానే కాకుండా కాకుండా…. జబర్దస్త్ కు జడ్జి గా వ్యవహరించిన రోజా భారీగా ఆస్తులను సంపాదించినట్టు తెలుస్తోంది. రోజా ఆస్తుల విలువ దాదాపుగా 7 కోట్ల 38 లక్షల వరకు ఉందని తెలుస్తోంది. అదేవిధంగా స్థిరాస్తుల విలువ 4 కోట్ల 64 లక్షల రూపాయలు ఉండగా చరాస్తుల విలువ 2 కోట్ల 74 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
Roja Rk selvamani ha
అదేవిధంగా రోజా కూతురు మరియు కుమారుడిపై 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక రోజా భర్త సెల్వమని పేరిట 58 లక్షల వరకు చరాస్తులు ఉన్నట్టు సమాచారం. ఇక రోజా లగ్జరీ లైఫ్ విషయానికి వస్తే ఆమె వద్ద ఖరీదైన కార్లు ఉన్నట్టు సమాచారం.
Advertisement
ALSO READ : మరణించిన మనిషిని తిరిగి బ్రతికించగలమా… సైన్స్ ఏం చెబుతుందంటే..?