Home » ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన రెజీనా… అలా చేయడం వల్లే అంటూ నిజం బయటపెట్టింది…!

ప్రెగ్నెన్సీ పై క్లారిటీ ఇచ్చిన రెజీనా… అలా చేయడం వల్లే అంటూ నిజం బయటపెట్టింది…!

by AJAY
Ad

రెజీనా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాకపోయినా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. పలువురు క్రేజీ హీరోల తో సినిమా లు చేసింది. అయితే సెలబ్రిటీలు ఒకటి చెబితే యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ మరో విధంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే దానివల్ల తాను కూడా ఇబ్బంది పడినట్టు రెజీనా తెలిపింది.

Advertisement

ఓ ఇంటర్వ్యూలో రెజీనా తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నట్టు అబద్దం చెప్పింది. దాంతో కొన్ని యూట్యూబ్ థంబ్ నెయిల్స్ లో రెజీనా కడుపుతో ఉంది అని రాసేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో రెజీనా ఆ విషయం పై క్లారిటీ ఇచ్చింది. తనకు మిస్తి దోయ్ అనే స్వీట్ అనే చాలా ఇష్టమని చెప్పింది. స్వీట్ తినడం కోసం రాత్రి సమయం లో స్వీట్ షాప్ కు వెళ్లినట్టు తెలిపింది.

Advertisement

అయితే అప్పుడే షాప్ క్లోజ్ చేయడం తో తాను మూసేసిన వ్యక్తిని అడిగినట్టు పేర్కొంది. కానీ ఆ వ్యక్తి నో చెప్పడం తో తాను కడుపుతో ఉన్నా అని ఆ స్వీట్ తినాలని ఉందని చెప్పనట్టు పేర్కొంది. కానీ యూట్యూబ్ వాళ్ళు అలా రాశారని పేర్కొంది. ఉండగా రెజీనా తాజాగా అన్యాస్ ట్యుటోరియల్ అనే వెబ్ సిరిస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

Visitors Are Also Reading