తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి రంభ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే సినిమాల్లో రంగప్రవేశం చేశాక అందరూ రంభలాగా ఉంటావని అనేటప్పటికీ రంభ అనే పేరు వచ్చింది. రంభని తెలుగు సినిమాకి పరిచయం చేసిన దర్శకుడు ఈవివి సత్యనారాయణ.
Advertisement
ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. అమాయకపు మొహంతో, డైలాగులతో, నటనతో, నాట్యంతో వయ్యారాలు వలకపోసింది. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంతకాలం క్రితం రంభ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పింది. రంభ మాట్లాడుతూ…’నేను ఎవరితో అయినా మా ఇంట్లో గొడవపడితే కనీసం నెల రోజులైనా మాట్లాడకుండా ఉంటాను.
Advertisement
నేను ఏదైనా తప్పు చేస్తే క్షమాపణలు చెప్తాను కానీ, నా తప్పు లేకుండా నన్ను నిందిస్తే మాత్రం నేను వారితో మాట్లాడను. అలా మా నాన్న విషయంలో ఒకసారి జరిగింది. అప్పట్లో నాన్నతో గొడవ జరిగినప్పుడు 6 నెలలు మాట్లాడకుండా ఉన్నాను. మా నాన్న అందువల్ల నరకం అనుభవించాడు. ఎందుకంటే ఆయనకి నేను అంటే ఎంతో ఇష్టం. కానీ గొడవ జరిగినప్పుడల్లా నా కారణంగా ఆయన ఈ నరకం అనుభవించేవాడు’ అంటూ చెప్పుకొచ్చింది రంభ.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
- సమంతను గట్టిగా హాగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ…!
- ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం
- Vimanam Teaser : ఫ్యామిలీ ఎమోషనల్ గా “విమానం” టీజర్