Telugu News » Blog » Punarnavi : అనారోగ్యానికి గురైన మరో హీరోయిన్‌.. ఊపిరితిత్తుల సమస్యతో..

Punarnavi : అనారోగ్యానికి గురైన మరో హీరోయిన్‌.. ఊపిరితిత్తుల సమస్యతో..

by Bunty

 

పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. పునర్నవి భూపాలంకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి అభిమానులు ఉన్నారు. అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది. ముందుగా ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన పునర్నవి, ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు నటించింది. మరెన్నో సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసి మెప్పించింది.

Advertisement

సినిమాల కంటే బిగ్ బాస్ షో ద్వారానే మంచి పేరు తెచ్చుకున్న పునన్నవి తాజాగా తన అనారోగ్య సమస్యల గురించి వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 3 షో ద్వారా పాపులర్ అయిన పునర్నవి పలు సందర్భాలలో బోల్డ్ గా కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం లండన్ లోని సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తున్న పునర్నవి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్య బారిన పడినట్లు అభిమానులతో ఆమె స్వయంగా పంచుకున్నారు.

Advertisement

ప్రస్తుతం తాను ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని ఆమె షాకింగ్ కామెంట్లు చేశారు. అనారోగ్య సమస్యతో నా కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని ఆమె చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో అనారోగ్యం బారిన పడడం అనేది ఇదే తొలిసారి అని, ఇదే చివరిసారి కూడా కావాలని కోరుకుంటున్నాను అని పునర్నవి తెలిపింది. అయితే ఆమె త్వరగా ఆరోగ్య సమస్య నుంచి కోలుకొని మళ్ళీ సినిమాలలో ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఇటీవల సమంత కూడా అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే.

READ ALSO : 2024 సంవత్సరం ఏపీలో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు…! వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!