Home » పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్ర లోకేష్.. ఎవరిమీదంటే..?

పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్ర లోకేష్.. ఎవరిమీదంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు పవిత్ర లోకేష్.. మరి ఈమె పేరు ఈ విధంగా వార్తల్లో కి ఎందుకు ఎక్కుతోంది.. అసలు ఏం జరిగింది అనేది ఓ సారి చూద్దాం..? సీనియర్ నటి గా పవిత్ర లోకేష్ ఎన్నో పాత్రల్లో చేసి మంచి గుర్తింపు పొందారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించారు ఈమె.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవిత్ర లోకేష్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం తల్లి పాత్రలు లేదా అక్క పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు పవిత్రా లోకేష్. ఈ తరుణంలోనే సీనియర్ నటుడు నరేష్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉందని చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ విషయంపై పవిత్ర లోకేష్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో అయితే వారిద్దరి వివాహం కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Advertisement

నరేష్ తన మూడవ భార్యతో విడిపోయారని, గత కొద్దిరోజుల నుంచి పవిత్ర లోకేష్ తోనే సన్నిహితంగా ఉంటున్నారని, పవిత్ర కూడా తన భర్తతో విభేదాల కారణంతో దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె నరేష్ కు దగ్గర అయినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరు కలిసి గత కొద్ది రోజులుగా సహజీవనం కూడా చేస్తున్నారని ఇండస్ట్రీలో పురోహితులు కూడా వినిపిస్తున్నాయి. కట్ చేస్తే పవిత్ర లోకేష్ స్వస్థలం మైసూర్లో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు వెల్లడించారు. ఫేస్బుక్లో పవిత్ర లోకేష్ పేరుతో ఫేక్ అకౌంట్ లో ని క్రియేట్ చేసి ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఆకతాయిలు కొందరు పోస్టులు చేస్తున్నారని చెబుతూ పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారట.

Advertisement

వారసత్వ ప్రచారాలు చేస్తూ నా పరువు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. దీని వల్ల తను మానసిక ప్రశాంతతకు దూరంగా ఉంటున్నానని పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంప్లైంట్ తో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆకతాయిల ని పట్టుకుని అరెస్టు చేసే పనిలో పడ్డారు. ఆ ఫేక్ ఎకౌంటు ని డిలీట్ చేయిస్తున్నారు. అయితే పవిత్ర లోకేష్ కన్నడ నటుడు దర్శకుడు మైసూరు లోకేష్ కూతురు. ఆయన వారసురాలిగా ఆయన కూడా ఇండస్ట్రీలో కి వచ్చారు. అయితే పవిత్ర లోకేష్ నరేష్ తో కలిసి ఆలయాల్లో పూజలు, ఎక్కడ చూసినా వీరిద్దరు కనిపిస్తుండడంతో వీరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేట్టు లేదు.

also read;

అమ్మోర్ ర‌ష్ చూసి తీసుకెళ్లి చెత్త కుప్ప‌లో ప‌డేసిన నిర్మాత‌.. ఇక ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ANR రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ కొట్టిన అన్నగారి సినిమా అదేనా..!

Visitors Are Also Reading