ఒకప్పుడు టాలీవుడ్ లో సత్తా చాటిన ముద్దుగుమ్మల లో హీరోయిన్ లయ కూడా ఒకరు. స్వయం వరం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన లయ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే పెళ్లి తర్వాత లయ సినిమాలకు దూరం అయ్యింది. అంతే కాకుండా భర్త తో కలిసి అమెరికా లో సెటిల్ అయ్యింది.
Also Read: చిరంజీవిని ఫాలో అవుతున్న బాలయ్య….ఏ విషయం లో అంటే…?
Advertisement
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో లయ పాల్గొనగా ఆసక్తికర కామెంట్ లు చేసింది. సినిమా విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి వెల్లడించింది. తన భర్త పేరు గణేష్ గోగుర్తి అని చెప్పడం తో పాటు ఆయన అమెరికాలో ఫేమస్ డాక్టర్ అని వెల్లదించింది. హాస్పిటల్ కు సంబందించిన అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారని మ్యానేజ్ చేస్తారని పేర్కొంది.
Advertisement
అంతే కాకుండా ఆయన చాలా బిజీగా ఉంటారని పేర్కొంది. తను కూడా అమెరికాలో కొంతకాలం పాటు ఐటి లో ఉద్యోగం చేసినట్టు తెలిపింది. ఇక తన భర్త తనను సినిమాలు మానేయాలని చెప్పలేదని ఆయన ఎంకరేజ్ చేశారని పేర్కొంది. తనకి ఇద్దరు సంతానం అని వారిలో కుమార్తె 9వ తరగతి చదువుతుంటే కుమారుడికి 12 యేళ్లు ఉంటాయని తెలిపింది.
తన కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ గా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది అని చెప్పింది. సినిమాల్లోకి వెళ్ళాలి అని పిల్లలను బలవంతం చేయను అని తెలిపింది. అంతే కాకుండా 2005 లో లాస్ ఏంజిల్స్ వెళ్ళినప్పుడు మా మదర్ వాళ్ళ కజిన్ పెళ్లి గురించి అడిగారని…మంచి మ్యాచ్ వస్తే చేసుకుంటా అని చెప్పానని పేర్కొంది. ఆ తరవాత 4 నెలలకే తన పెళ్లి అయ్యిందని చెప్పింది.
Also Read: Telugu Cinema News, Telugu News