Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » చాలా మెచ్యూర్ గా అనిపించింది..ధనుష్- ఐశ్వర్య విడాకులపై గృహలక్ష్మి నటి..!

చాలా మెచ్యూర్ గా అనిపించింది..ధనుష్- ఐశ్వర్య విడాకులపై గృహలక్ష్మి నటి..!

by AJAY
Ads

సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి ప్రస్తుతం బుల్లి తెర‌పై సంద‌డి చేస్తోంది. సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సీరియల్స్ లో నటిస్తూ సమయం దొరికినప్పుడల్లా కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ జనాలను ఆకర్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా సామాజిక, రాజ‌కీయ‌, సినిమా అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది.

Advertisement

kasthuri on danush

Ad

ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్ విడాకులపై కస్తూరి స్పందించింది. క‌స్తూరి సోష‌ల్ మీడియా వేధిక‌గా త‌న పోస్ట్ లో….. దీర్ఘకాలిక సంబంధం ముగిసినప్పుడు ఎల్లప్పుడూ విచారంగా ఉంటుంది. ప్రజలు భూతద్దం లా పరిశీలిస్తుండ‌గా విడాకులు జరగడం చాలా కష్టం. కానీ విడిపోయిన ఇద్దరికీ మాత్రమే తెలుసు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది. మరెవరికీ తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు.

Danush Aishwarya

Danush Aishwarya

ధనుష్ విడాకులు తీసుకున్నప్పుడు చేసిన ప్రకటన ఆయన వాడిన పదాలు చాలా మెచ్యూర్ గా అనిపించాయి. అంటూ కస్తూరి పేర్కొంది. ఇదిలా ఉండగా ధనుష్ ఐశ్వర్యలు 2004లో కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. 18 ఏళ్ల పాటు ఇద్ద‌రూ క‌లిసి మెలిసి ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

kasthuri

అయితే వీరిద్దరి విడాకులకు అసలైన కారణం తెలియదు కాని రకరకాల వార్తలు త‌మిళ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు ఇద్దరినీ మళ్లీ కలుపుతామని ధనుష్ తండ్రి వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. ధనుష్ రజనీకాంత్ అభిమానులు కూడా ఐశ్వర్య ధనుష్ మళ్లీ కల‌వాల‌ని కోరుకుంటున్నారు.

Advertisement

also read : ఎలా ఉండేవారు ఎలా మారారు? సినీ మాయ‌!

Visitors Are Also Reading