Home » మూడ‌వ పెళ్లికి సిద్ధ‌మైన క‌రాటే క‌ల్యాణి.. అందుకోస‌మేనా..?

మూడ‌వ పెళ్లికి సిద్ధ‌మైన క‌రాటే క‌ల్యాణి.. అందుకోస‌మేనా..?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ న‌టి కరాటే క‌ల్యాణి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  మ‌న‌స్సులో అనుకున్న‌ది నిక్క‌చ్చిగా చెబుతూ వివాదాల్లో చిక్కుకోవ‌డం ఆమెకు కొత్త‌కాదు. అయితే ఆమె జీవితం అంద‌రికీ తెలిసిన పుస్త‌క‌మే. రెండు పెళ్లిళ్లు అర్తం చేసుకుని భ‌ర్త‌లు విడిపోవ‌డం, పిల్ల‌ల కోసం ఆమె ప‌డుతున్న త‌ప‌న ఇవ‌న్నీ బిగ్‌బాస్ స‌మ‌యంలో ఆమె చెప్పుకొచ్చింది.

ALSO READ :  Jabardasth Pavithra : జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పై ర‌చ్చ చేసే లేడీ క‌మెడీయ‌న్ ప‌విత్ర ఎవ‌రో తెలుసా.?

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న పెళ్లిళ్లు గురించి, పిల్ల‌ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏమిటి అనేది మీ అంద‌రికీ తెలుసు. భార్య అంటే వంటింటికి మాత్ర‌మే ప‌నికొచ్చేది కాదు. నేను అంద‌రిలాంటి ఆడ‌పిల్ల‌ను కాదు. నేను నిప్పును ఎవ‌రైనా ఎంత సేపు ప‌ట్టుకోగ‌ల‌రు. అందుకే నా వివాహ జీవితం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. వాళ్లు వ‌దిలి వెళ్ల‌డంలో నా త‌ప్పులేదు. న‌న్ను వాళ్లే అర్థం చేసుకోలేదు. అందుకే గొడ‌వ‌ల మ‌ధ్య విసిగిపోయి విడాకులు తీసుకున్నా ఇప్పుడు హ్యాపీగా సింగిల్ గా నివ‌సిస్తున్నా అయితే ఇప్ప‌టివ‌ర‌కు నాకు నిజ‌మైన ప్రేమ ల‌భించ‌లేదు. ప్రేమ‌, పెళ్లి అంటూ న‌న్ను వాడుకొని వ‌దిలేశారు.

జీవితంలో నాకు నిజ‌మైన ప్రేమ దొరికిన‌ప్పుడు నేను మూడ‌వ పెళ్లికి సిద్ధం. స‌రైన అబ్బాయి వ‌చ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా స‌హ‌జీవ‌నానికి కూడా రెడి. పిల్ల‌ల కోసం నేను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాను. ఆ ఆశ తీర‌లేదు. జీవితంలో తీరాల‌ని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం క‌ల్యాణి మాట‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Also Read :  100 నుండి 1000 రోజులు ఆడిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Visitors Are Also Reading