Home » ఆ ద‌ర్శ‌కుడు న‌న్ను మోసం చేశాడు..న‌టి జ‌య‌వాణి ఓపెన్ కామెంట్స్…!

ఆ ద‌ర్శ‌కుడు న‌న్ను మోసం చేశాడు..న‌టి జ‌య‌వాణి ఓపెన్ కామెంట్స్…!

by AJAY
Ad

టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి జ‌య‌వాణి. రండి ల‌క్షాదికారి కండి అనే టీవీ సీరియ‌ల్ ద్వారా జ‌య‌వాణి ఎంట్రీ ఇచ్చింది. సీరియ‌ల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న త‌ర‌వాత జ‌య‌వాణి ఆ త‌ర‌వాత సినిమాల్లోకి రంగ ప్ర‌వేశం చేసింది. విక్ర‌మార్కుడు సినిమా ద్వారా జ‌య‌వాణికి న‌టిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత చాలానే సినిమాల్లో న‌టించింది.

jayavani

jayavani

కానీ అనుకున్న‌మేర స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. ఇదిలా ఉండ‌గా జ‌య‌వాణిని కెరీర్ ప్రారంభంలో డైరెక్ట‌ర్ మోసం చేసిన‌ట్టు తెలిపింది. తాను సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో తాను న‌ల్ల‌గా ఉన్నానని కొంత‌మంది అవ‌మానించార‌ని చెప్పింది. అయితే అదే స‌మ‌యంలో ఓ సినిమా ఉంద‌ని ఫోటో షూట్ కు రావాల‌ని ఓ ద‌ర్శ‌కుడు త‌న‌ను పిలిచిన‌ట్టు తెలిపింది.

Advertisement

Advertisement

jayavani

jayavani

ఫోటో షూట్ పూర్త‌యిన త‌ర‌వాత ఆ ద‌ర్శ‌కుడి నుండి ఒక్క ఫోన్ కూడా రాలేద‌ని చెప్పింది. కానీ ఆ ద‌ర్శ‌కుడుతో చేసిన ఫోటో షూట్ మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని జ‌య‌వాణి తెలిపింది. ఆ ఫోటోలు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయో త‌న‌కు తెలియ‌ద‌ని కానీ ఆ ఫోటో షూట్ త‌న కెరీర్ కు చెర‌గ‌ని మ‌చ్చ‌లా మిగిపోయింద‌ని తెలిపింది.

Visitors Are Also Reading