సినిమా అంటే స్క్రీన్ పై కనిపించే రంగుల ప్రపంచమే అనుకుంటారు. కానీ ఆ రంగుల ప్రపంచాన్ని సృష్టించడాని ఎంతో మంది కష్టపడాల్సి ఉంటుంది. రాత్రింభవళ్లు కష్టపడితేనే గానీ ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాదు. ఇక హీరోలు హీరోయిన్ ముఖ్య నటీనటులు కష్టపడినప్పటికీ వాళ్లకు షూటింగ్ సమయంలో సరైన వసతులు ఉంటాయి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చిన్న నటీనటులకు ఇబ్బందులు తప్పవు. అలాంటి ఇబ్బందులనే తాను కూడా ఎదురుకున్నానని క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పింది. చెన్సైలో ఇండస్ట్రీ ఉన్న సమయంలో తాను అవకాశాల కోసం మొదట చెన్నై వెళ్లి సినిమాల్లో నటించానని హేమ తెలిపింది.
ఇప్పుడంటే కారవాన్ లు ఉన్నాయిగానీ అప్పట్లో షూటింగ్ స్పాట్ లో అలాంటి ఏర్పాట్లు ఉండేవి కాదని చెప్పింది. కనీసం టాయిలెట్ లు కూడా ఉండేవి కాదని వ్యాఖ్యానించింది. తన తరం కంటే తన ముందు తరం ఇంకా ఇబ్బందులు పడిందని చెప్పింది. ఇక ముత్యాల సుబ్బయ్యగారి భారతనారి అనే సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ చేదు అనుభవం ఎదురైందని తెలిపింది.
Advertisement
Advertisement
సినిమా షూటింగ్ సమయంలో తాను డైరెక్టర్ తో కలిసి భోజనం చేస్తుండగా ప్రొడక్షన్ బాయ్ వచ్చి తనను పక్కకు వెళ్లి భోజనం చేయమన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో తనకు కోపం వచ్చి టేబుల్ ను పడేసానని అక్కడే ఉన్న కుర్చీని అతడిపై విసిరానని చెప్పింది. ఆ తరవాత మరో సినిమా షూటింగ్ సమయంలో అదే ప్రొడక్షన్ బాయ్ తనకు ఎంతో గౌరవం ఇచ్చాడని చెప్పింది. ప్రొడక్షన్ బాయ్ అవమానించినప్పుడే తాను కూడా నటిగా గుర్తింపు తెచ్చుకుని పెద్దవాళ్లతోనే భోజనం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.
also read : మనసంతా నువ్వే….మహేష్ బాబు నుండి ఉదయ్ కిరణ్ కు ఎలా వచ్చింది?