Telugu News » Blog » ఒకప్పటి స్టార్ హీరోయిన్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? చివరికి అలాంటి స్థితిలో..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జీవితంలో ఇంత విషాదం ఉందా..? చివరికి అలాంటి స్థితిలో..!

by AJAY
Published: Last Updated on
Ads

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో గౌతమి కూడా ఒకరు. సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో గౌతమి సినిమాలు చేశారు. గౌతమి తెలుగు అమ్మాయి కాగా ఎక్కువగా తమిళ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. విజయ్ చందర్ హీరోగా నటించిన దయామయుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Advertisement

kamalhasan gouthami

kamalhasan gouthami

ఆ తర్వాత తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన గాంధీ నగర్ రెండో వీధి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. అంతేకాకుండా వెంకటేష్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం, నాగచైతన్యతో చైతన్య అనే సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇక గౌతమి సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విశ్వ నటుడు కమల్ హాసన్ తో ప్రేమలో పడ్డారు.

Advertisement

ఆ తర్వాత కమల్ గౌతమిలు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2016 అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుండి గౌతమి సింగిల్ గా ఉంటున్నారు. వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కమల్ హాసన్ కు గౌతమి పూర్తి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కూతురు పుట్టిన తర్వాత తాను సింగిల్ పేరెంట్ గా ఉన్నానని చెప్పారు. చేతిలో పసిబిడ్డను పట్టుకుని పేరెంట్స్ దగ్గరకు వచ్చానని ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు నేను నా బిడ్డ మాత్రమే మిగిలిపోయాను అంటూ గౌతమి ఎమోషనల్ అయ్యారు. దాంతో గౌతమి జీవితంలో ఇంత విషాదం ఉందా అని అభిమానులు బాధపడుతున్నారు.

Advertisement

Also read : Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన చరణ్, ఉపాసన