Home » ఆడవాళ్ళే ఆఫర్స్ ఇస్తారు… క్యాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ హీరోయిన్ సంచలనం….!

ఆడవాళ్ళే ఆఫర్స్ ఇస్తారు… క్యాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ హీరోయిన్ సంచలనం….!

by AJAY
Published: Last Updated on

భీమవరం బుల్లోడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరోయిన్ ఎస్తర్ నోరోన్హ. మొదటి సినిమాతోనే ఎస్తేర్ అభిమానులను సంపాదించుకుంది. తరవాత వెయ్యి అబద్ధాలు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా జయజానకి నాయక, గరం సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉండగా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయం లోనే ఎస్తేర్ టాలీవుడ్ నటుడు రాపర్ నోయల్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

కానీ కొన్ని నెలల లోనే వీరి పెళ్లి పెటాకులు అయ్యింది. అయితే తాజాగా ఎస్తేర్ 69 సంస్కార్ కాలనీ అనే బోల్డ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజాగా ఉన్న ఎస్తేర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ పై కూడా ఎస్తేర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ లో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చాలా చూసాను….సినిమా ఆఫర్ లతో పాటు ఈ ఆఫర్ లు కూడా వచ్చేవి. వాళ్ళను ఇంప్రెస్ చేయాలని…వీళ్ళను ఇంప్రెస్ చేయాలని అనేవాళ్ళు.

ఆఫర్ ల కోసం ఏం చేయడానికి అయినా రెడీ అని చెప్పిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆ సో కాల్డ్ హీరోయిన్స్ చాటింగ్ స్క్రీన్ షాట్ లు కూడా నేను చూసాను. కెరీర్ కోసం ఏమైనా చేస్తామని అంటారు. అలా స్వయంగా ఆడవాళ్ళే ఆఫర్స్ ఇవ్వడం కూడా ఇండస్ట్రీ లో ఉంది. క్యాష్టింగ్ కౌచ్ నేను కూడా ఎడురుకున్నా….కానీ ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయలేదు. అంటూ ఎస్తేర్ సంచనల ఆరోపణలు చేసింది.

Visitors Are Also Reading