Home » పాజిటివ్ టాక్ వస్తోన్న “ఘోస్ట్” సినిమాను వదులుకున్న అన్ లక్కీ స్టార్స్….! ఎందుకు వదులుకున్నారు అంటే…?

పాజిటివ్ టాక్ వస్తోన్న “ఘోస్ట్” సినిమాను వదులుకున్న అన్ లక్కీ స్టార్స్….! ఎందుకు వదులుకున్నారు అంటే…?

by AJAY
Ad

కింగ్ నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో నాగ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాలోని ట్విస్టులు… యాక్షన్ సీన్లు అదిరిపోయాయి అంటూ రివ్యూ ఇస్తున్నారు.

Advertisement

గతంలో నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్ గానే తెరకెక్కింది. కానీ ఈ సినిమా అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఇక గోస్ట్ సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను కొంతమంది రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మొదటగా నాగార్జున తనయుడు నాగచైతన్యతో తెరకెక్కించాలని అనుకున్నాడట ప్రవీణ్ సత్తార్. నాగచైతన్యకు స్టోరీ వినిపించగా తనకు ఈ పాత్ర సెట్ అవ్వదేమో అని చైతు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే అదే కథ విన్న నాగార్జున ఇంప్రెస్ అయ్యి తాను ఈ సినిమా చేస్తానని ప్రవీణ్ సత్తార్ తో చెప్పాడట. అలా చైతూ రిజెక్ట్ చేసిన కథలో నాగార్జున హీరోగా నటించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట ఎఫ్-2 సినిమా హీరోయిన్ మెహ్రీన్ ని అనుకున్నారు. అయితే సినిమాలో హీరోయిన్ బికినీ వేసుకోవాల్సి ఉంటుంది. చాలా సన్నివేశాల్లో బోల్డ్ గా నటించాల్సి ఉంటుంది. ఈ కారణంతో మెహ్రీన్ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా సినిమాలో హీరోయిన్ గా శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ను కూడా అనుకున్నారట. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఈ సినిమా చేసేందుకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. దాంతో చిత్ర యూనిట్ సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక సోనాల్ చౌహాన్… నాగార్జున పెయిర్ సినిమాలో బాగుందని కామెంట్లు వస్తున్నాయి.

Visitors Are Also Reading