Home » “అర్జున్ రెడ్డి” సినిమాను రిజెక్ట్ చేసి బాధపడుతున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా…!

“అర్జున్ రెడ్డి” సినిమాను రిజెక్ట్ చేసి బాధపడుతున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా…!

by AJAY
Ad

కొన్ని సినిమాలు ఒక హీరోతో అనుకుంటే మ‌రో హీరోతో చేయాల్సి వ‌స్తుంది. ఇండ‌స్ట్రీలో ఇది చాలా కామ‌న్. అయితే హీరోలు లేదా హీరోయిన్ లు తాము రిజెక్ట్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే ఎలాంటి న‌ష్టం లేదు. కానీ తాము రిజెక్ట్ చేసిన హిట్ అయితే ఏకంగా ట్రెండ్ సెట్ట‌ర్ అయితే…అలాంటిదే విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన అర్జున్ రెడ్డి సినిమా విష‌యంలో జ‌రిగింది. అర్జున్ రెడ్డి సినిమాకు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

సందీప్ కు ఇదే మొద‌టి సినిమా కానీ ప‌దిసినిమాలు చేసిన ద‌ర్శ‌కుడి కంటే చక్క‌గా సినిమా తీసి హిట్ కొట్టాడు. కోపం ఎక్కువ ఉన్న ఒక యువ‌కుడు త‌న కోపంతో ప్రేమ‌ను ఎలా కోల్పాతాడు. కెరీర్ ను ఎలా నాశ‌నం చేసుకుంటాడు. ఆ త‌ర‌వాత అన్ని ప‌రిస్థితులు ఎలా స‌ర్దుకుంటాయి అనేదే ఈ సినిమా క‌థ‌. సింపుల్ కాన్స‌ప్ట్ కానీ పెళ్లైన త‌ర‌వాత కూడా హీరోయిన్ తిరిగి త‌న ఇంటికి తీసుకెళ్ల‌డ‌మే ఈ సినిమాలో కొత్త‌ద‌నం… అంతే కాకుండా ఈ సినిమా క‌థ నార్మ‌ల్ అయినా సినిమాలో వ‌చ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవ‌ల్ ఉంటాయి.

Advertisement

దానికి తోడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ల న‌ట‌న కూడా ఎంతో ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంది. అలా అన్నీ ఈ సినిమాకు ప్ల‌స్ అవ్వ‌డంతో యూత్ కు తెగ న‌చ్చేసింది. ఈ సినిమాతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. హీరోయిన్ షాలినీ పాండే న‌ట‌న‌కు కూడా ప్ర‌శంస‌లు అందాయి. ఆమె ముఖం కూడా ఒక్క సినిమాతోనే ప్రేక్ష‌కులు గుర్తుపెట్టుకునేలా మారిపోయింది.

అయితే నిజానికి సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు హీరోగా శ‌ర్వానంద్ ను అనుకున్నాడ‌ట‌. కానీ శ‌ర్వానంద్ సినిమాలో ముద్దులు…ఎలివేష‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రిజెక్ట్ చేశాడు. ఆ త‌వ‌రాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఆఫ‌ర్ వ‌చ్చింది. సందీప్ మొద‌ట హీరోయిన్ గా పార్వ‌తి నెయిర్ ను అనుకున్నాడ‌ట‌. కానీ ఆమె రిజెక్ట్ చేయ‌డంతో షాలినీ పాండేను హీరోయిన్ గా తీసుకున్నాడు.

ALSO READ :

సౌందర్యకు తీరని కోరిక ఉండేదట.. అది ఏంటో తెలిస్తే మీరు కన్నీరు పెడతారు..?

Visitors Are Also Reading