Home » బాహుబ‌లి సినిమాలో న‌టించే ఛాన్స్ ను మిస్ చేసుకున్న 6 గురు స్టార్స్ వీళ్లే..!

బాహుబ‌లి సినిమాలో న‌టించే ఛాన్స్ ను మిస్ చేసుకున్న 6 గురు స్టార్స్ వీళ్లే..!

by AJAY
Ad

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు రాగా అందులో బాహుబలి సినిమా చాలా స్పెష‌ల్. ఈ సినిమాతో జక్క‌న్న అద్భుతాన్ని సృష్టించాడు. ఈ సినిమా విమర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంది.

Advertisement

ఈచిత్రంతో జ‌క్క‌న్న క్రేజ్ తో పాటూ తెలుగు సినిమా క్రేజ్ ఎల్ల‌లు దాంటి. అయితే ఇలాంటి సినిమాలో అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ కొంత‌మంది స్టార్స్ మిస్ చేసుకున్నారు. అలా బాహుబ‌లి ఆఫ‌ర్ ను మిస్ చేసుకున్న స్టార్స్ ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….

Also Read:  ప‌వ‌న్, మ‌హేశ్ స‌హా 12మంది స్టార్స్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో సౌత్ ఇండియా స్టార్ గా ఎదిగిన సూర్య‌..ఆ సినిమా ఏంటంటే..?

రాజ‌మౌళి ఈ సినిమాలో శివ‌గామి పాత్ర‌కోసం మొద‌ట‌గా శ్రీదేవిని సంప్ర‌దించారు. కానీ శ్రీదేవి రెమ్యున‌రేషన్ ఎక్కువ డిమాండ్ చేయ‌డంతో పాటూ కొన్ని వ‌స‌తులు కేట‌యించాల‌ని డిమాండ్ చేశార‌ట‌. దాంతో బ‌డ్జెట్ గురించి ఆలోచించి జ‌క్క‌న్న వెనక్కి తగ్గారు.

Also Read:  వైజాగ్ సాయి ప్రియ సీన్ యూపీలో రిపీట్….! ఉంటే ప్రియుడితోనే లేదంటే….?

Advertisement

శివ‌గామి కోసం త‌న‌ను కూడా సంప్ర‌దించార‌ని మంచు ల‌క్ష్మి చెప్పింది. అయితే ప్ర‌భాస్ కు త‌ల్లి పాత్ర అనే స‌రికి తాను చెయ్య‌లేద‌ని చెప్పుకొచ్చింది. ఆ కార‌ణం వ‌ల్లే బాహుబ‌లిని మిస్ చేసుకున్న‌ట్టు పేర్కొంది. ఇక చివ‌ర‌గా ఈ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించి అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

బాహుబ‌లి సినిమాలో క‌ట్ట‌ప్ప పాత్ర‌లో స‌త్య‌రాజ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం జ‌క్క‌న్న మొద‌ట బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ను అనుకున్నార‌ట‌. కానీ అమితాబ్ నో చెప్ప‌డంతో ఆ ఆఫ‌ర్ స‌త్య‌రాజ్ కు వెళ్లింది.

సినిమాలో బాహుబ‌లితో త‌ల‌పడే విల‌న్ బ‌ల్లాల దేవ పాత్ర కోసం జాన్ అబ్ర‌హం ను కూడా అనుకున్నారు. కానీ ఆ పాత్ర‌కు రానా నే సెట్ అవుతాడ‌ని అత‌డినే ఎంపిక చేశారు.

బాహుబ‌లి సినిమాలో ఓ ముఖ్యపాత్ర కోసం త‌న‌ను కూడా సంప్ర‌దించార‌ని సూర్య సికింద‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో చెప్పారు. ఆ ఛాన్స్ వ‌దులుకున్నందుకు త‌ర‌వాత బాధ‌ప‌డ్డాన‌ని చెప్పారు.

బాహుబ‌లిలో త‌మ‌న్నా న‌టించిన అవంతిక పాత్ర కోసం మొద‌ట చిత్ర‌యూనిట్ బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ ను సంప్ర‌దించింది. కానీ సోన‌మ్ క‌పూర్ రిజెక్ట్ చేయ‌డంతో ఆ ఆఫ‌ర్ త‌మ‌న్నాకు దక్కింది.

Also Read: Udaykiran: ఉదయకిరణ్ ప్రేమ వ్యవహారం ముందే చిరంజీవికి తెలుసా ? కానీ ఏమి జ‌రిగిందంటే..?

Visitors Are Also Reading