సినిమా పరిశ్రమలో కొంత మంది తారలు తమ కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉండి మరిన్ని సినిమాలు చేయాల్సి ఉండగానే కన్నుమూసారు. అలా సినీ పరిశ్రమకు ఈ లోకానికి దూరమైన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని నటుడు శ్రీహరి హీరోగా… విలన్ ఎన్నో విలక్షణ పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల్లో నటించారు. అయితే శ్రీహరి షూటింగ్ సమయంలోనే అనారోగ్యానికి గురి కావడంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందారు.
Advertisement
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. పునీత్ కెరీర్ ప్రస్తుతం ఫిక్స్ లో ఉంది. అలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పునీత్ మరణించడం అభిమానులను కలచివేసింది.
Advertisement
సౌత్ ఇండియన్ చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నటుడు రఘువరన్. విలన్ పాత్రల తో ముఖ్యంగా రఘువరన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 200కు పైగా సినిమాల్లో నటించి అలరించారు. 59 ఏళ్ల వయస్సులో అనారోగ్యం బారిన పడిన రఘువరన్ మరణించారు.
తన కామెడీతో తెలుగు వారి మనసు దోచుకున్న నటుడు వేణుమాధవ్. దాదాపు 500 సినిమాల్లో నటించి వేణు మాధవ్ అలరించాడు. అనారోగ్యం బారిన పడటంతో ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన నటి ఆర్తి అగర్వాల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. కొంతకాలం తర్వాత ఆర్తి కెరీర్ డీలా పడింది. ఆ తర్వాత వివాహం చేసుకుని అమెరికా వెళ్ళింది. కానీ గొడవల కారణం గా భర్తతో విడాకులు తీసుకుంది. అయితే సన్నబడాలని ఆర్తి లైపో థెరపీ ఆపరేషన్ చేసుకుంది. ఆపరేషన్ ఫెయిల్ అవడంతో మృతి చెందింది.
also read : తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలు తమిళంలో మాత్రం అట్టర్ ఫ్లాప్…!