Home » కెరీర్ పీక్స్ లో ఉండ‌గా 30ఏళ్లలోనే క‌న్నుమూసిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

కెరీర్ పీక్స్ లో ఉండ‌గా 30ఏళ్లలోనే క‌న్నుమూసిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవ్వ‌డం అంటే అంత సులువైన విష‌యం కాదు. ఎంతో టాలెంట్ తో పాటూ చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఆ త‌ర‌వాత స‌క్సెస్ వ‌స్తే వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తాయి. కానీ అలా ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమాల్లో స‌క్సెస్ అవుతున్న క్ర‌మంలోనే కొంత‌మంది టాలీవుడ్ స్టార్ లు 30 ఏళ్ల‌కే ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. వాళ్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

 

Advertisement

అందాల తార సౌంద‌ర్య ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్నారు. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే 31 ఏళ్ల వ‌య‌సులోనే సౌంద‌ర్య విమాన‌ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు ఉద‌య్ కిర‌ణ్ కూడా అతిచిన్న వ‌య‌సులోనే దూరమ‌య‌యాడు. సినిమాల్లో ఆఫ‌ర్ లు రావ‌డంలేద‌ని డిప్రెషన్ లోకి వెళ్లిన ఉద‌య్ కిర‌ణ్ కేవ‌లం 33 ఏళ్ల‌కే ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయాడు.

Advertisement

చిన్న‌వ‌య‌సులోనే ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దివ్యభార‌తి కేవ‌లం 18ఏళ్ల వ‌య‌సులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న స‌మ‌యంలోనే భ‌వ‌నం పై నుండి కిందప‌డి మ‌ర‌ణించింది.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో య‌శోసాగ‌ర్ చిన్న వ‌య‌సులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. కేవ‌లం 27 ఏళ్ల వ‌య‌సులోనే య‌శోసాగ‌ర్ కార్ యాక్సిడెంట్ లో మ‌ర‌ణించారు.

arthi agarwal

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తి అగ‌ర్వాల్ కూడా చిన్న వ‌య‌సులోనే క‌న్నుమూశారు. బ‌రువు త‌గ్గేందుకు స‌ర్జ‌రీ చేయించుకున్న ఆర్తి అది విక‌టించ‌డంతో క‌న్ను మూశారు.

అందాల తార ప్ర‌త్యూష కూడా చిన్న వ‌య‌సులోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. కేవ‌లం 21 ఏళ్ల వ‌య‌సులోనే ప్ర‌త్యూష సినిమాల‌కు ఈ లోకానికి దూర‌మ‌య్యారు. ఇప్ప‌టికీ ప్ర‌త్యూష మ‌ర‌ణం మిస్ట‌రీగానే మిగిలిపోయింది.

ALSO READ : విల‌న్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా స‌క్సెస్ అయిన 5గురు టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

Visitors Are Also Reading