సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎంతో టాలెంట్ ఉండాలి. అంతేకాకుండా చాలా కష్టపడితేనే కానీ సినిమాల్లో అవకాశాలు రావు. కానీ ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే వరుస ఆఫర్ లు వస్తుంటాయి.
Advertisement
ఆ తరవాత కొన్నేళ్ల పాటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అయితే కొంతమంది సినీతారలు చిన్నవయసులోనే సక్సెస్ అయ్యారు కానీ రకరకాల కారణాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
ఆ తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం…దివ్య భారతి ఈ ముద్దుగుమ్మ కేవలం 18 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ అనుకోని ప్రమాదం జరగటం వల్ల బిల్డింగ్ పై నుండి కిందపడి చిన్న వయసులోనే కన్నుమూసింది.
సౌందర్య అంటే పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు వారికి అప్పటికీ ఇప్పటికీ సౌందర్య అంటే ఫేవరెట్. కానీ సౌందర్య చిన్నవయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది.
Advertisement
ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. స్టార్ హీరోగా ఎదగాల్సిన ఉదయ్ కిరణ్ జీవితం అనుకోని సంఘటనల వల్ల మలుపు తిరిగింది. చివరికి ఉదయ్ కిరణ్ చిన్నవయసులోనే ఆత్మహ* చేసుకున్నాడు.
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించి అభిమానులను సంపాదించకుంది. కానీ ఆర్తి కూడా చిన్నవయసులోనే ఓ సర్జరీ వికటించి కన్నుమూసింది. యశోసాగర్ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. కానీ యశోసాగర్ గా కూడా చిన్నవయసులోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.
సిల్క్ స్మిత ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మత్తుకళ్లతో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సిల్క్ చిన్న వయసులోనే ఆత్మహ* చేసుకుంది. అంతే కాకుండా హీరోయిన్ ప్రత్యూష కూడా చిన్నయసులోనే కన్నుమూసింది. వీళ్లతో పాటూ అష్టాచెమ్మా భార్గవి, ఇష్టం చరణ్, హీరోయిన్ రాధామోనాల్ లు కూడా చిన్నవయసులోనే రకరకాల కారణాల వల్ల కన్నుమూశారు.