Home » శివాజీ సినిమాలో విలన్ పాత్రను.. మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..!

శివాజీ సినిమాలో విలన్ పాత్రను.. మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..!

by Sravya
Ad

తమిళ్లో రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమా పెద్ద సక్సెస్ ని అందుకుంది. అందులో భాగంగానే ఆ సినిమాని తెలుగులో డబ్ చేయగా ఇక్కడ కూడా ఒక మంచి హిట్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో విలన్ గా సుమన్ నటించిన మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. అయితే ముందు ఆ పాత్ర కోసం మరో స్టార్ హీరోని సంప్రదించారు కానీ ఆ అవకాశాన్ని స్టార్ హీరో సద్వినియోగం చేసుకోకపోవడంతో సుమన్ కి అవకాశం వచ్చింది లేదంటే ఆ పాత్రలో ఒక స్టార్ హీరో మెప్పించి ఉండేవారు. మరి ఇంతకీ ఆ పాత్రని మిస్ చేసుకున్న నటుడు ఎవరనే విషయాన్ని చూద్దాం.

Advertisement

శివాజీ సినిమాలో విలన్ గా సుమన్ నటించారు. అయితే ఆ పాత్ర కోసం ముందు మోహన్ బాబుని సంప్రదించారట. మోహన్ బాబు ఆ పాత్రకి నో చెప్పారు అందుకని సుమన్ ని తీసుకున్నారు. రజినీ కాంత్ మోహన్ బాబు ఇద్దరు ఫ్రెండ్స్ కావడం వలన అదే చనువుతో రజనీకాంత్ మోహన్ బాబుని అడిగారు. కానీ మోహన్ బాబు మాత్రం విలన్ గా చేయడం నచ్చలేక దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది విలన్ క్యారెక్టర్ కాకుండా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటే చెప్పమని అదైతే చేస్తానని అన్నారట దాంతో రజినీకాంత్ కూడా తనని ఫోర్స్ చేయకుండా ఆ పాత్రలోకి సుమన్ ని తీసుకున్నారు.

Advertisement

సుమన్ తన విలనిజం ని పండించడమే కాకుండా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునే విధంగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. మొత్తానికైతే సుమన్ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో తెలుగు తమిళ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు శంకర్ కూడా తన రూట్లోనే అవినీతి మీద తన అస్త్రాన్ని సంధిస్తూ చేసిన ప్రయత్నం వచ్చింది ఇదిలా ఉంటే రజినీకాంత్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమాతో మరోసారి రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading