Home » చంద్రబాబు పై పోటీ విషయం లో క్లారిటీ ఇచ్చిన విశాల్…!

చంద్రబాబు పై పోటీ విషయం లో క్లారిటీ ఇచ్చిన విశాల్…!

by AJAY
Ad

కోలీవుడ్ హీరో విశాల్ తండ్రి ఏపీ వాసి అన్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం చెన్నై లో సెటిల్ అయ్యారు. దాంతో విశాల్ కు ఏపీ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ తో కూడా విశాల్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. విషయం బహిరంగంగా వైఎస్ జగన్ ను పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే హీరో విశాల్ 2024 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు పై పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులు గా వైసిపి తరపున కుప్పం లో విశాల్ భరిలోకి దిగుతారు అనే వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే. ఈ వార్తలు ఎక్కువ అవ్వడం తో విశాల్ స్పందించారు. ట్విట్టర్ లో విశాల్…..ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం లో పోటీ చేస్తున్నా అంటూ వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

Advertisement

అసలు ఈ వార్తలు ఎక్కడ పుట్టాయో కూడా అర్థం కావడంలేదు. నేను ఆ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నా నన్ను పోటిచేయమని కూడా ఎవరూ సంప్రదించలేదు. ప్రస్తుతం నాదృష్టి మొత్తం సినిమా ల పైనే ఉంది. ఏపి రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. అంటూ విశాల్ ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

Visitors Are Also Reading