Home » టాలీవుడ్‏లో మరో విషాదం..సినీ న‌టుడు శ్రీ‌ను మృతి

టాలీవుడ్‏లో మరో విషాదం..సినీ న‌టుడు శ్రీ‌ను మృతి

by Anji
Ad

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస‌గా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే అనారోగ్యంతో ప‌లువురు, కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌రికొంద‌రూ న‌టీన‌టులూ మృతి చెందగా.. తాజాగా మ‌రొక న‌టుడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. సినీ న‌టుడు కొంచాడ శ్రీ‌నివాస్‌(47) అనారోగ్యం కార‌ణంగా బాధ‌ప‌డుతున్నాడు.

Advertisement

Actor Srinu: టాలీవుడ్‏లో మరో విషాదం.. అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి..
శ్రీ‌కాకుళం జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటీ ప‌రిధిలోని బ‌స్టాండ్ స‌మీపంలో శ్రీ‌నివాస్ నివాస‌ముంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా తీవ్రంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డ్డాడు. కాశీబుగ్గ‌లోని ఓ ప్ర‌యివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వ‌దిలారు. ఇప్ప‌టివ‌ర‌కు 40కి పైగా చిత్రాల్లో న‌టించారు. అదేవిధంగా 10కి పైగా టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టించి.. ఆది, శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌, ప్రేమ‌కావాలి, ఆ ఇంట్లో వంటి చిత్రాలు శ్రీ‌నుకు మంచి పేరును తీసుకొచ్చాయి.

Advertisement

Visitors Are Also Reading