Home » తన కంటే 20 ఏళ్ల చిన్నోడితో షకీలా లవ్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

తన కంటే 20 ఏళ్ల చిన్నోడితో షకీలా లవ్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నటి గా షకీలా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.. సినిమాల్లో క్రేజ్ ఉండే పాత్రలు చేస్తూ అప్పట్లో ఎంతోమంది అభిమానులను ఉర్రూతలూగించింది. స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ షకీలా కు ఉండేది అంటే అప్పట్లో ఆమె ఎంతటి పేరు సంపాదించుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె సినిమా థియేటర్ లోకి వస్తుంది అంటే మలయాళంలో కొంత మంది స్టార్ హీరోలు సైతం తమ సినిమాలు వాయిదా వేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సినిమాలో ఆమె సీన్స్ చూస్తే అభిమానుల నుంచి విజిల్స్ తో థియేటర్ అంతా మార్మోగిపోయింది.. అలాంటి షకీలా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నా కానీ నిజజీవితంలో అనేక ఇబ్బందులు పడింది.

Advertisement

ALSO READ:కాంతార హీరో రిష‌బ్ శెట్టి భార్య ఎవ‌రో తెలుసా.? ఆయ‌న ల‌వ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా.?

ఆమె పెళ్లి విషయంపై ఇప్పటికే అనేక వార్తలు వస్తాయి. షకీలా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే విషయాలు చూద్దాం.. షకీలా ను తన కుటుంబ సభ్యులు దూరం పెట్టారని, కేవలం తాను సంపాదించిన డబ్బులకు మాత్రమే వాళ్లు విలువ ఇచ్చే వారని ఆవేదన వ్యక్తం చేసింది. షకీలా ఎన్నో సినిమాల్లో అలాంటి పాత్రలు చేసి ఎంతో డబ్బు సంపాదించి తన బంధువుల దగ్గర ఉంచింది. కానీ చివరకు వారు ఆమెను మోసం చేశారు. దీంతో కొంతకాలానికి అందరికీ దూరమై ఇంటి నుంచి బయటకు వచ్చిన షకీలా తర్వాత ఒంటరిగానే జీవించింది. తన జీవితంలో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. అతగాడిని ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ జరగలేదు.ఎందుకంటే ఆ వ్యక్తి వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే.. తన లవ్ గురించి ఆ వ్యక్తి గురించి ఒక ఇంటర్వ్యూలో షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది. తను 30 ఏళ్ల వ్యక్తి తో లవ్ ట్రాక్ లో ఉన్నానని, ప్రస్తుతం నా వయసు 53 సంవత్సరాలు అని తెలియజేసింది.

Advertisement

అతడు చాలా కేరింగ్ గా చూసుకుంటాడని, నిజమైన ప్రేమ అలానే ఉంటుందని వ్యాఖ్యనించింది. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల పెళ్లి చేసుకోలేదని, కానీ జీవితకాలం అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను అని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. అంతేకాకుండా షకీలా గతంలోనూ కొంతమంది తో ప్రేమాయణం నడిపింది. పలువురు సినిమా వాళ్ళతో పాటు బయటి వ్యక్తులతో కూడా అఫైర్స్ పెట్టుకుంది. ఆమె ఇప్పటికీ ఎనిమిది మంది తో లవ్ లో పడిందని తెలుస్తోంది. అంతమందితో అలా చేసినా కానీ ఎవరినీ కూడా పెళ్లి చేసుకునే వరకు వెళ్లలేదని, అభిమానులు మాత్రం ఆమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading