సినిమాల్లో అవకాశాలు రాకముందు అన్నీ కష్టాలే కానీ ఒక్కసారి అవకాశాలు వస్తే మాత్రం తిరుగుండదు. డబ్బు లగ్జరీ లైఫ్ తో ఎంతో సరదాగా గడిచిపోతుంది. సినిమా అనేది రంగుల ప్రపంచం అక్కడ సంపాదన ఎంత ఉంటుందో ఖర్చులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఒకవేళ డబ్బులను ఎలా ఖర్చు చేయాలి ఎలా పొదుపు చేయాలో తెలియకపోతే మళ్లీ ఇబ్బందులు తప్పవు. వరుస సినిమాలు చేసి భారీ రెమ్యునరేషన్ లు పుచ్చుకున్నా డబ్బులు లేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న నటులలో సమీర్ కూడా ఒకరు. సమీర్ మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈటీవీ సీరియల్స్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సమీర్ సీరియల్ హీరోయిన్ తో షూటింగ్ సెట్స్ లోనే పాడు పనులు చేశాడంటూ ఆరోపణలు రావడంతో సమీర్ ను ఈటీవీ యాజమాన్యం ఆ సీరియల్ ను నిలిపివేసి సమీర్ ను శాశ్వతంగా బ్యాన్ చేసింది.
నిజానికి అలా తనపై తప్పుడు ప్రచారం జరగటం…..ఈ టీవీ అతడిని బ్యాన్ చేయడమే మంచిదైందని సమీర్ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తరవాతనే తనకు సినిమాలలో అవకాశాలు వచ్చాయని చెప్పారు. అంతే కాకుండా ఇన్ని సినిమాలలో నటించిన మీరు ఇప్పుడు ఎంత సంపాదించారు అంటూ యాంకర్ ప్రశ్నించగా సినిమాల ద్వారా ఎలాంటి అవసరం వచ్చినా ఇతరులను చేతులు చాపి అడగకుండా ఉండేంత సంపాదించానని సమీర్ వెల్లడించారు.
ALSO READ : “భీమ్లా నాయక్” ట్రైలర్ లో ఈ తప్పులు గమనించారా…!
బిల్డింగులు కొనలేదని కోట్లు సంపాదించలేదని కానీ హ్యాపీగా ఫ్యామిలితో గడిపేంత సంపాదించానని చెప్పారు. ఇక తనకు కెరీర్ మొదట్లో రూ.500 రెమ్యునరేషన్ ఉండేదని అన్నారు. ఇప్పుడు ఒక రోజుకు లక్షకంటే తక్కువ రెమ్యునరేషన్ ఉంటుందని చెప్పారు. తన సక్సెస్ లో తన భార్య పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పారు.