Telugu News » ఆయన ‘ముస్లిం’ అయినా కూడా అయిదు సార్లు ‘అయ్యప్ప మాల’ వేశారు ఎందుకో తెలుసా ?

ఆయన ‘ముస్లిం’ అయినా కూడా అయిదు సార్లు ‘అయ్యప్ప మాల’ వేశారు ఎందుకో తెలుసా ?

by AJAY MADDIBOINA
Published: Last Updated on

టాలీవుడ్ న‌టుడు స‌మీర్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో పాజిటివ్ మ‌రియు నెగిటివ్ రోల్స్ తో స‌మీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ కు స్నేహితుడిగా స‌మీర్ కు ఎంతో గుర్తింపు ఉంది. అయితే స‌మీర్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న గురించి త‌న ఫ్యామిలీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. స‌మీర్ అన్ని మ‌తాల‌ను స‌మానంగా గౌర‌విస్తార‌ట‌.

Ads

అంతే కాకుండా స‌మీర్ త‌ల్లి బ్రాహ్మిణ్ కాగా తండ్రీ ముస్లీం అని తెలిపారు. త‌న ఇంట్లో దేవుడి గుడిలో అజ్మీర్ ద‌ర్గా తో పాటు వెంక‌టేశ్వ‌రుడి ఫోటో జీజ‌స్ అదే విధంగా అన్ని దేవుళ్ల ఫోటోలు ఉంటాయ‌ని తెలిపాడు. తానను ఏ మతం అని అడిగితే ఇండియ‌న్ అని చెబుతాన‌న్నారు. తాను అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తాన‌ని అన్నారు. తాను చిన్న‌ప్ప‌టి నుండి త‌న అమ్మ‌మ్మ వ‌ద్ద పెరిగాన‌ని అంతే కాకుండా ఐదు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాన‌ని స‌మీర్ తెలిపారు.

60 రోజులు దీక్ష చేశాన‌ని చెప్పారు. ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో త‌న‌ను చిరంజీవి చూసి షాక్ అయ్యార‌ని తెలిపాడు. నీ పేరు స‌మీర్ నువ్వు ముస్లీం క‌దా మాల వేసుకున్నావేంట‌ని అడిగార‌ని తెలిపాడు. దాంతో తన గురించి చెప్పాన‌ని చిరంజీవి సూప‌ర్ అంటూ మెచ్చుకున్నార‌ని అన్నారు.

త‌న పేరును కూడా తాను వెంక‌ట స‌మీర్ గా మార్చుకున్నాన‌ని స‌మీర్ పేర్నొన్నారు. తాను ఇంటి పేరును ఎప్పుడూ వాడ‌న‌ని అందువ‌ల్లే ఎవ‌రికీ పెద్దగా తెలియ‌ద‌ని అన్నారు. తాను శ్రీరామ రాజ్యం సినిమాలో న‌టించిన స‌మ‌యంలో షూటింగ్ పూర్త‌య్యే వ‌ర‌కూ నాన్ వెజ్ ముట్టుకోలేద‌ని చెప్పాడు.

also read : అన్న‌గారు క్రియేట్ చేసీన‌ ఆ రికార్డును ఇప్ప‌టికీ ట‌చ్ చేయ‌లేక‌పోయారు..!


You may also like