ప్రముఖ నటుడు ప్రభు తమను మోసం చేఆడంటూ ఆయన తోబుట్టువుల కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమ తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ.. ప్రభు, ఆయన సోదరుడు రామ్‌కుమార్ లపై వారిద్దరి సోదరిమణులు శాంతి, రజ్విలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్‌లు దిగ్గజ నటుడు నడిగర్ తిలకం శివాజీ గణేషన్ కుమారులనే విషయం తెలిసిందే. వీరితో పాటు శాంతి, రజ్వీ ఇద్దరు కుమార్తెలు కలరు.
Advertisement
అయితే శివాజీ గణేషన్ మరణించిన తరువాత 20 సంవత్సరాలకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం తలెత్తడం గమనార్హం. ఈ అంశం ఇప్పుడు కోలీవుడ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్‌కుమార్‌లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా తండ్రి చనిపోయిన తరువాత దాదాపు రూ.271 కోట్లు ఆస్తిని సరిగ్గా పంచలేదని, తమని మోసం చేసి పూర్తి ఆస్తిని ఆస్తులను విక్రయించారని ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు.
Advertisement
అదేవిధంగా 1000 తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తవులను ప్రభు, రామ్‌కుమార్ అపహరించడమే కాకుండా శాంతి థియేటర్‌లో ఉన్న రూ.82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారిద్దరి పేరిట మార్చుకున్నట్టు వారు ఆరోపించారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు పేర్కొంటున్నారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్ల పేర్లను మాత్రమే కాకుండా వారి కుమారులైన విక్రమ్ ప్రభు, దష్యంత్‌లను ప్రతివాదులుగా చేర్చి పిటిషన్‌లో వారి పేర్లను కూడా పేర్కొనడం గమనార్హం.
Also Read :
విజయశాంతి, రమ్యకృష్ణల ఫ్యామిలీ లైఫ్ లో ఈ కామన్ పాయింట్ ను గమనించారా..?
మెగాస్టార్ “అడవిదొంగ” తో క్రియేట్ చేసిన రికార్డును ఎవరూ టచ్ చేయలేదు…ఆ రికార్డు ఏంటంటే..?