Telugu News » Blog » ద‌మ్ముంటే ఆ ప‌ని చెయ్…న‌రేష్ కు రెండో భార్య స‌వాల్..!

ద‌మ్ముంటే ఆ ప‌ని చెయ్…న‌రేష్ కు రెండో భార్య స‌వాల్..!

by AJAY

టాలీవుడ్ న‌టుడు వీకే న‌రేష్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్ర లోకేష్ లు స‌హజీవ‌నం చేస్తున్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యం పై న‌రేష్ రెండో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి ఓ మీడియా ఇంట‌వ్యూలో ఘాటుగా స్పందించారు. గతంలో ర‌మ్యా ర‌ఘుప‌తి కొంద‌రి వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని మోసం చేశారంటూ వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పోలీస్ స్టేష‌న్ లో కూడా కేసులు న‌మోద‌య్యాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

Ads

అయితే దీనిపై కూడా ర‌మ్య ర‌ఘుప‌తి ఫైర్ అయ్యారు. మీడియాను అడ్డం పెట్టుకుని న‌రేష్ త‌ప్పుడు ప్ర‌చారం చేయించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కోవిడ్ కార‌ణంగా డ‌బ్బులు ఇవ్వ‌లేక‌పోయానని త‌న‌పై ఫిర్యాదు చేసిన ఐదుగురికి డబ్బులు ఇచ్చాన‌ని చెప్పారు. వారితో త‌న‌కు మంచి సంభందాలు ఉన్నాయని అన్నారు. కానీ న‌రేష్ త‌న‌పై కుట్ర చేశార‌ని అన్నారు. ఆ ఐదుగురిని రెచ్చ గొట్టి త‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Ads

త‌న పై నెగిటివ్ ప్ర‌చారం చేయించి న‌రేష్ ల‌బ్ది పొందాల‌ని అనుకున్నాడ‌ని ఆరోపించారు. త‌న కుటుంబ ప్ర‌తిష్ట‌త‌ను బ‌జారుకు ఈడ్చాల‌ని ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు. నీకు ద‌మ్ముంటే నీ తండ్రికి పుట్టావ‌నుకుంటే నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకో అంటూ ర‌మ్య ర‌ఘుప‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు…ఇప్ప‌టికీ నేను నీ భార్య‌నే ఎవ‌రైనా న‌రేష్ భార్య అంటే దుర‌దృష్ట‌వ‌శాత్తూ స్పందించాల్సి వ‌స్తోంద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఇంకా నేను డైవోర్స్ పేప‌ర్ పై సంత‌కాలు చేయ‌లేదు. నా భ‌ర్త‌తో నాకు స‌త్సంబంధాలు లేవు. నాకు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ లో స్ప‌ష్టత ఉంది….నాకు విడాకులు ఇవ్వ‌కుండా పెళ్లికి రెడీ అవుతున్నారు. ఆ త‌ర‌వాత నా ప‌రిస్థితి ఏంటి అంటూ రమ్యార‌ఘుప‌తి స్పందించారు.