Home » భద్రినాథ్ సినిమా లేడీ విలన్ భర్త టాలీవుడ్ లో టాప్ విలన్ అన్న సంగతి తెలుసా…? ఆయన ఎవరంటే…?

భద్రినాథ్ సినిమా లేడీ విలన్ భర్త టాలీవుడ్ లో టాప్ విలన్ అన్న సంగతి తెలుసా…? ఆయన ఎవరంటే…?

by AJAY
Ad

Actor Murali Sarma wife, Name, Family: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీల మధ్య బంధుత్వాలు ఉంటాయి. అంతేకాకుండా ఇండస్ట్రీలో చాలామంది భార్యాభర్తలు కూడా ఉన్నారు. కానీ ఆ విషయం ప్రేక్షకులకు మాత్రం తెలియదు. ఫలానా నటి భర్త కూడా నటుడు అన్న విషయం తెలిసినప్పుడు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. అంతెందుకు…. భద్రీనాథ్ సినిమా లేడీ విలన్ భర్త కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే…. ఆ విలన్ భర్త ఎవరు అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం…

Also Read:  స‌మంత‌కు బిగ్ షాక్…ఏం మాయ చేశావే సినిమాలో చైతూకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్.?

Advertisement

Actor Murali Sarma wife, Name, Family

Actor Murali Sarma wife, Name, Family

 

అల్లు అర్జున్ తమన్నా హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా భద్రీనాథ్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తెరకెక్కించారు. వివి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లేడీ విలన్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తమన్నా కు అత్త గా నటించిన అశ్విని కల్సేకర్ తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది. అశ్విని తెలుగు కంటే బాలీవుడ్ సినిమాలో ఎక్కువగా నటించారు.

Advertisement

Actor Murali Sharma Wife

Actor Murali Sarma wife, Name, Family

Actor Murali Sarma wife, Name, Family

 

అంతేకాకుండా హిందీ… మరాఠీ సీరియల్స్ లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. భద్రీనాథ్ సినిమా తర్వాత నిప్పు, మెహబూబా సినిమాల్లో సైతం అశ్విని నటించారు. బాలీవుడ్ లో రోహిత్ శెట్టి, ఆర్జీవిలతో సైతం ఆమె సినిమాలు చేశారు. అయితే అశ్విని భర్త టాలీవుడ్ కు చెందిన నటుడు మురళీ శర్మ అన్న విషయం చాలామందికి తెలియదు.

May be an image of 3 people

ప్రస్తుతం వరుస ఆఫర్ లు అందుకుంటున్న మురళీ శర్మ… అశ్వినిని 2002లో పెళ్లి చేసుకున్నారు. మురళి శర్మ టాలీవుడ్ లో తండ్రి పాత్రలు మరియు విలన్ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే అశ్వినికి మొదట 1998లో నితీష్ పాండే అనే వ్యక్తితో వివాహం జరిగింది. కానీ 2002లో నితీష్ తో అశ్విని విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మురళీ శర్మను అశ్విని రెండో వివాహం చేసుకున్నారు.

Also Read: బాహుబలి 2 కి పొన్నియిన్ సెల్వన్ 2 కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ? 

Visitors Are Also Reading