సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. ఇప్పుడు ఉన్న ఫేమ్… స్టార్ డమ్ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకప్పుడు స్టార్ లుగా రాణించిన వారు చాలామంది ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారు. ఇక ఒకప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేసిన హీరో హరీష్ పరిస్థితి కూడా అలానే ఉంది. హరీష్ అప్పట్లోనే లవర్ బాయ్ గా ఎంతో ఇమేజ్ ను సంపాదించుకున్నారు.
Also Read: చనిపోయే ముందు రోజే విలన్ రఘువరన్ కు అలాంటి అనుభవం…ఎవ్వరికీ తెలియని నిజం ఇదే…!
Advertisement
తెలుగుతో పాటు తమిళ హిందీ మలయాళ భాషలలో సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ఒక్కసారిగా కనుమరుగవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. హరీష్ పేరు చెప్తే ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆయన ఫోటో చూస్తే మాత్రం తప్పకుండా గుర్తుపడతారు.
Also Read: వాల్తేర్ వేరయ్య vs వీర సింహ రెడ్డి ఈ రెండిటిలో నిర్మాతలకి లాభాలు తెచ్చే సినిమా ఏదంటే..?
Advertisement
అయితే హరీష్ ఎందుకు సినిమాలకు దూరమయ్యారు…? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు..? ఎలా ఉన్నారు. అనే విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం….. 1979లో ముద్దుల కొడుకు సినిమాతో హరీష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత తెలుగులో సీతమహాలక్ష్మి, కొండవీటి సింహం, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్రస్వామి లాంటి చిత్రాల్లో నటించాడు. 8 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. అంతేకాకుండా తమిళ్ లో యంగ్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
మొత్తం హరీష్ 250 సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత హరీష్ సడన్ గా సినిమాల నుండి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్లే హరీష్ సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం హరీష్ ఫ్యామిలీతో ముంబైలో స్థిరపడ్డాడు. అంతేకాకుండా సినిమాలకు దూరమవడంతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నాడు.
Also read : ఎన్టీఆర్ ని ‘శ్రీవారు’ అని ప్రేమగా పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా ?