టాలీవుడ్ అలాగే.. ఇతర చిత్ర పరిశ్రమలను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.
READ ALSO : Manchu Manoj-Manchu Vishnu : మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో
Advertisement
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం (84) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోనే తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్ కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.
Advertisement
READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి
సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం కేరళలోని పాలక్కాడ్ కు చెందిన మలయాళీ. ఆయన భార్య పేరు మోహిని. ఈ దంపతులకు అజిత్ కుమార్ తో పాటు అనుప్ కుమార్, అనిల్ కుమార్ మొత్తం ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా అజిత్, ఆయన భార్య శాలిని, పిల్లలందరూ ప్రస్తుతం యూరప్ వెకేషన్ లో ఉన్నారు. తన తండ్రి మరణవార్త విని ఇప్పటికే చెన్నైకు పయనమైనట్లు తెలుస్తుంది.
READ ALSO : పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!