Home » సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొన‌సాగుతున్న ఆచార్య‌..!

సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొన‌సాగుతున్న ఆచార్య‌..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా ప్లాఫ్ అయిన విష‌యం తెలిసిందే. అయితే ఆచార్య న‌ష్టాలు కొర‌టాల శివ మెడ‌కు బిగుసుకుంటున్నాయ‌ట‌. ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కునిగానే కాకుండా నిర్మాణంలో కూడా అన్నీ తానై చూసుకున్నాడట‌ కొర‌టాల శివ‌. అయితే బిజినెస్ వ్య‌వ‌హారాలు కూడా అత‌నే చూసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ భారీ న‌ష్టాల‌ను పూడ్చే బాధ్య‌త కూడా కొర‌టాల శివ మీద‌నే ప‌డింద‌ని టాక్ వినిపిస్తోంది. ఆచార్య మూవీ మాత్రం చిన్న న‌ష్టాలేమి మిగిల్చ‌లేదట‌. దాదాపు 80నుంచి 100 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలను మిగిల్చిదని టాక్.


ప్ర‌స్తుతం ఆచార్య దెబ్బ‌కు డిస్ట్రిబ్యూట‌ర్లు విల‌విల్లాడుతున్నార‌ట‌. త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని కొర‌టాల ఆఫీస్ ముందు ధ‌ర్నాలు చేసేందుకు వ‌చ్చార‌ట‌. ఈ విష‌యంలో ఏమిటో తేల్చ‌క‌పోతే త‌మ న‌ష్టాల‌ను పూడ్చ‌క‌పోతే చిరంజీవి వ‌ర‌కు విష‌యాన్ని తీసుకెళ్లుతామ‌ని..చిరంజీవి ఇంటి ముందు సైతం ఆందోళ‌న చేప‌డుతామ‌ని హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆచార్య గురించి ప‌లు వార్త‌లు వైర‌ల్ అవుతూ ఉన్నాయి.

Advertisement

Advertisement

కొంత నెటిజ‌న్లు కొర‌టాల శివ మీద ట్రోలింగ్ చేసేస్తున్నారు. మ‌రికొంత మంది కొర‌టాల శివ‌కు మ‌ద్దుతు తెలుపుతున్నారు. #JusticeForKoratalaShiva అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కొర‌టాల శివ‌, ఆచార్య సినిమా పేరు మ‌రొక సారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లోకి వ‌చ్చింది. ఆచార్య సినిమా, చిరంజీవి మీద విప‌రీతంగా ట్రోలింగ్ కొన‌సాగుతోంది. డిస్ట్రిబ్యూట‌ర్లు ఆందోళ‌న చేపట్ట‌డంతో మ‌రొక‌సారి ఆచార్య చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించి న‌ష్టాల‌ను భ‌రించ‌డం అంత సుల‌భం ఏమి కాదు. వీటికి ప‌రిష్కారం ఎలా ల‌భిస్తుంది. కొర‌టాల శివ ఏమి చేస్తాడు..? చిరంజీవి ముందుకు వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాడా అనేది మాత్రం ఎదురుచూడాలి మ‌రి.

Also Read : 

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మోసం చేశాడంటూ వేణు షాకింగ్ కామెంట్స్‌..!

మెగా హీరోతో పాన్ ఇండియా ప్లాన్స్ లో ఉన్న సుజిత్…?

 

Visitors Are Also Reading