గత కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ విడుదల తేదీలపై సందిగ్దత నెలకొన్న విషయం తెలిసినదే. తాజాగా మేకర్స్ వాటన్నింటిని తొలగిస్తూ.. విడుదల తేదీలను ప్రటించేశారు. వాయిదాను ఒకరి తరువాత ఒకరూ ఏవిదంగా వాయిదా వేశారో విడుదల తేదీలను కూడా ఒకరి తరువాత మరొకరూ అదేవిధంగా ప్రకటించేశారు. తొలుత ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లానాయక్, ఆ తరువాత ఎఫ్-3 వెంట వెంటనే విడుదల తేదీలను ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ మార్చి 25న, ఆచార్య ఏప్రిల్ 29న, భీమ్లానాయక్ మాత్రం ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా రెండు తేదీలను అనౌన్స్ చేసింది.
Advertisement
ముఖ్యంగా కరోనా పరిస్థితులు వచ్చే నెలలో చాలా వరకు తగ్గితే ఫిబ్రవరి 25 విడుదల కానున్నట్టు తెలుస్తున్నది. లేదా ఏప్రిల్01 వరకు మాత్రం ఆగాల్సిందే అని తెలుస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సితార ఎంటర్‌టైన్ మెట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ‘ఆచార్య‘, ‘ఎఫ్-3’ లాంటి సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసినదే. తాజాగా రెండు సినిమాలు కొత్త విడుదల తేదీలను ప్రకటించాయి.
Advertisement
రెండు సినిమాల్లో ఒక్కరోజు గ్యాప్‌లో థియేటర్లలో పోటీ పడనున్నాయి. ఏప్రిల్ 28న ఎఫ్-3 అడుగుపెడుతుండగా..ఏప్రిల్ 29న ఆచార్య రానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అన్ని ఆలోచించుకుని అందరి సూచలను తీసుకొని ఆచార్యను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. అదేవిధంగా ఆర్ఆర్ఆర్, మార్చి 25న థియేటర్లలో విడుదల కానున్నదని కూడా తెలిపారు. దీంతో ఆతేదీని రాజమౌళికి ఇచ్చినట్టు మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే ఎఫ్-3 రెండు డిఫరెంట్ కథనాలు, ఒకటి నవ్వులు పూయిస్తే.. మరొకటి ఆలోచింపజేస్తుంది. మరీ ఈ రెండు సినిమాలలో ఏదీ భారీ హిట్ గా నిలుస్తుందో చూడాలి మరీ.