మన ఇండియాలో ఒక్క మనిషి జీవితాన్ని నిర్ధేశించేది నవగ్రహాలు అని అందరూ నమ్ముతారు. ఈ నవగ్రహాలను అనుకూలంగా మలుచుకోవడానికి చాలా పూజలు కూడా చేస్తారు. అయితే ఇందులో అందరూ ఎక్కువగా భయపడేది మాత్రం శని దేవునికి. ఒకవేళ జాతకంలో శని అనేది ప్రవేశిస్తే 14 ఏళ్ళు ఉంటుంది. అయితే ఎక్కువగా చాలా మంది శని దేవుడు చెడు చేస్తారు అనుకుంటారు. కానీ ఆయన మంచి కూడా చేస్తారు. ఇక ఈ నెల 30న శని జయంతి. అమావాస్య నాడు పుట్టున శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ రాశివారు ఏం పనులు చేయాలి.. ఏం దానం చేయాలియా అనేది మనం ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఈ శని జయంతి రోజున మేషరాశి వారు నల్ల నువ్వులు, ఆవనూనె దానం చేయడం మంచింది. అలాగే వృషభ రాశి వారు నల్లరంగు దుప్పట్లు దానం చేయాలి. ఇక నల్లని వస్త్రాలు మిథున రాశి వారు దానం చేస్తే… నల్ల నువ్వులు, పెసరపప్పు, ఆవనూనె కర్కాటక రాశి వారు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. అదే విధంగా సింహ రాశికి వారు ఓం వరేణాయ నమః మంత్రాన్ని జపించాలి. ఇక కన్యా రాశి వారు నల్ల గొడుగు, తోలు పాదరక్షలను దానంగా ఇవ్వడం శుభప్రదం.
Advertisement
అదే విధంగా ఇక శని జయంతి నాడు తులా, వృశ్చిక రాశులకు చెందిన వారు నల్ల గొడుగు, నల్లని వస్త్రాలు, ఆవాల నూనె, ఇనుమును దానంగా ఇవ్వాలి. ధనుస్సు రాశికి చెందిన ప్రజలు ఈరోజు ఓం ప్రాం ప్రిం ప్రౌం సః శనయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. అలాగే జంతువులకు… పక్షులకు ఆహరం ఇవ్వడం మకరం రాశివారు చేయాలి. చివరగా ఈ శని జయంతి నాడు కుంభ రాశి వారు మందులు.. మందులతో పాటుగా నల్ల నువ్వులు, ఆవాల నూనె మీన రాశి వారు దానం చేస్తే దాని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :