Home » వార‌సుల‌కు తోడుగా.. తెర‌పై మెర‌వ‌గా

వార‌సుల‌కు తోడుగా.. తెర‌పై మెర‌వ‌గా

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార్ల‌కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండ‌దు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, శోభ‌న్‌బాబు, కృష్ణ వంటి స్టార్ హీరోలు క‌లిసి ఎన్నో మ‌ల్టీస్టార్ సినిమాల్లో న‌టించారు. ముఖ్యంగా ఇద్ద‌రు అగ్ర తార‌లు క‌లిసి న‌టిస్తున్నార‌ని తెలిస్తే చాలు ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగానే ఉంటాయి. ఇక స్టార్ హీరోలు త‌మ న‌ట వారుసుల‌తో క‌లిసి న‌టిస్తే ఇక ఆ కిక్కే వేర‌బ్బా..!


సినిమా ప్రారంభం నుంచే వాటిపై అందరిలో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంటుంది. అరుదుగా కుదిరే ఇలాంటి అపురూప క‌ల‌యిక‌ల సినిమాలు త్వ‌ర‌లో చాలా రానున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు కూడా వ‌చ్చాయి. ఈమ‌ధ్య కాలంలో వ‌చ్చిన సినిమాల‌లో మ‌నం సినీ ప్రియుల‌కు ఎంతో ప్ర‌త్యేకంగా గుర్తుండిపోయింది. ఏఎన్నార్ ఒకేసారి ఇటు త‌న త‌న‌యుడు నాగార్జున‌, అటు మ‌న‌వ‌ళ్లు నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ల‌తో కూడా క‌లిసి సంద‌డి చేసి మెప్పించారు. అదేవిధంగా నాగార్జున నాగ‌చైత‌న్య‌తో క‌లిసి బంగార్రాజు చిత్రంలో న‌టించారు.

Advertisement

Chiranjeevi and Ram Charan's Acharya release postponed due to Covid-19  spike - Movies News

Advertisement

బంగార్రాజు లాంటి సినిమా మాదిరిగానే ఆచార్య‌తో చేసి చూపించ‌నున్నారు మెగాస్టార్ చిరంజీవి. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించిన తొలి చిత్రం. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కించారు. ఇదివ‌ర‌కు బ్రూస్‌లీలో గెస్ట్ రోల్ చేసిన చిరంజీవి.. ఖైదీ నెంబ‌ర్ 150లో ఓ సాంగ్‌లో డాన్స్ చేశాడు రామ్‌చ‌ర‌ణ్‌. అదేవిధంగా మ‌గ‌ధీర సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి చిరంజీవి డ్యాన్స్ చేసాడు. కానీ పూర్తిస్థాయిలో ఇద్ద‌రూ క‌లిసి సినిమాలో న‌టించ‌డం మాత్రం ఇదే తొలిసారి.

Krishnam Raju says, I can't direct Prabhas

అదేవిధంగా కృష్ణంరాజు న‌ట వార‌సుడిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన అన‌తికాలంలోనే హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఇప్పుడు రెబ‌ల్స్ ఇద్ద‌రూ క‌లిసి ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి న‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే బిల్లా, రెబ‌ల్ చిత్రాల‌లో న‌టించారు. ఇక రాధేశ్యామ్‌లో క‌లిసి క‌నువింధు చేయ‌నున్నారు. అదేవిధంగా ద‌గ్గుబాటి హీరోలు వెంక‌టేష్‌, రానా క‌లిసి న‌టిస్తే చూడాల‌న్న‌ది సినీ ప్రియుల కోరిక‌. ఎప్ప‌టి నుంచో ఊరిస్తూ వ‌స్తున్న ఈ బాబాయ్ అబ్బాయిలు క్రేజీ కాంబినేష‌న్ రానా నాయుడు రూపంలో రానున్న‌ది. కాక‌పోతే ఇది వెండితెర‌పై సంద‌డి చేసే చిత్రం కాదు. ఓటీటీ వేదిక‌గా అల‌రించ‌నున్న వెబ్‌సిరీస్‌.

Visitors Are Also Reading