మెగాస్టార్ తరం నాటి స్టార్ హీరోయిన్ లలో విజయశాంతి కూడా ఒకరు. నిజానికి విజయ శాంతిని మిగితా హీరోయిన్ లతో పోల్చలేం. దానికి కారణం మిగితా హీరోయిన్ లు గ్లామర్ రోల్స్ చేస్తే విజయ శాంతి మాత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనను తానే హీరో రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీ లో ఎదిగి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
Advertisement
ఇక విజయశాంతి టాలీవుడ్ లెజెండరీ హీరోలు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ నటించిన సత్యం శివం సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరవాత గ్యాప్ లేకుండా విజయశాంతి వరుస సినిమాలను చేసింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లతో సినిమా లి చేస్తూ అలరించింది. ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తూ ఆకట్టుకుంది.
Advertisement
VIJAYASHANTHI
విజయశాంతి నటించిన నామ్మక్క సారక్క, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమా లు సూపర్ హిట్ హిట్ అయ్యాయి. ఇక సరిలీరు నీకేవ్వరు సినిమా తో రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత మరికొన్ని ఆఫర్స్ కూడా వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా విజయ శాంతి పర్సనల్ విషయాలు మాత్రం చాలా తక్కువమంది తెలుసు. విజయ శాంతికి ఇంకా పెళ్లి కూడా అయ్యిందా లేదా అన్నది కూడా చాలామంది అనుమానం. కానీ నిజానికి విజయశాంతి వివాహం ఎప్పుడో జరిగింది. ఆమె భర్త పేరు శ్రీనివాస్ ప్రసాద్…ఇక విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చింది కూడా తన భర్త ప్రోత్సాహం తోనే అని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.