Telugu News » Blog » నటుడు వేణు భార్య ఎవరో తెలుసా..? ఆమె ఇప్పుడు ఏమిచేస్తుందంటే..!

నటుడు వేణు భార్య ఎవరో తెలుసా..? ఆమె ఇప్పుడు ఏమిచేస్తుందంటే..!

by AJAY
Ads

Hero venu wife and Family: టాలీవుడ్ లో కొంతమంది హీరోలు గుర్తుండిపోయే సినిమాలు చేసి కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యారు. అయినప్పటికీ వారు చేసిన సినిమాలు మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి హీరోలలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. దాదాపు ఇరవై ఆరు సినిమాల్లో నటించిన వేణు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్వయంవరం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు మొదటి సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు.

Advertisement

Also Read: సినిమా పరిశ్రమను వేధించడం మానుకోండి… ఏపీ సర్కార్ నిర్ణయంపై సిద్ధార్థ్ ఫైర్..!

Actor venu wife

Actor venu wife

ఈ సినిమాలో వేణు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా వేణు నటించిన పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషి గా, చిరునవ్వులతో, స్వయంవరం లాంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఆ తర్వాత వేణు మెల్లి మెల్లిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చారు. మళ్ళీ 2012లో ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో కీలక పాత్రలో నటించి అలరించారు.

Advertisement

ఆ తరవాత దాదాపు పది ఏళ్ళు అవుతున్నా మళ్ళీ తెరపై కనిపించలేదు. కానీ వేణు రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే వేణు సినిమాలకు దూరమై వైవాహిక జీవితం లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు చేస్తున్నప్పుడే అనుపమ చౌదరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురితో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు. అనుపమ చౌదరి హీరోయిన్ లాంటి అందం తో తన భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఇక ఆమె భర్త మరియు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ గడిపేస్తోంది.

Advertisement

Also Read: MAHESH BABU : మౌంటెన్‌ డ్యూకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సూపర్‌ స్టార్‌