Home » “వేదం” సినిమా క‌ర్పూరం ఎవ‌రో తెలుసా…అనుష్క‌కు ఏమ‌వుతుందంటే..!

“వేదం” సినిమా క‌ర్పూరం ఎవ‌రో తెలుసా…అనుష్క‌కు ఏమ‌వుతుందంటే..!

by AJAY
Ad

కొన్ని సినిమాలు క‌లెక్ష‌న్ లు రాబ‌డితే మ‌రికొన్ని సినిమాలు క‌లెక్ష‌న్లు త‌క్కువ రాబ‌ట్టినా ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలా ప్రేక్షకుల మ‌దిలో స్థానం సంపాదించుకున్న చిత్రాల‌లో వేదం సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాకు క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా అల్లు అర్జున్ మరియు మ‌నోజ్ లు హీరోలుగా న‌టించారు.

Advertisement

ఇక ఈ సినిమాలో దీక్షాసేత్ హీరోయిన్ గా న‌టించింది. అంతే కాకుండా బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయి ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు.

ఈ సినిమా క‌మ‌ర్షియల్ సినిమా కాకుండా డిఫ‌రెంట్ గా కొంద‌రి జీవితాల‌లో జ‌రిగే క‌థ‌ల‌ను చూపిస్తుంది. ఇక సినిమాలో అనుష్క కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో అనుష్క అలాంటి పాత్ర‌లో నటించ‌డం అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. అనుష్క న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

Also Read: కంచెర‌పాలెం హీరో ఎంగేజ్మెంట్…వైర‌ల్ అవ‌తున్న ఫోటోలు…!

Advertisement

ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో మ‌రో గుర్తిండిపోయే పాత్ర క‌ర్పూరం. ఎప్పుడూ అనుష్క ప‌క్క‌నే ఉండే హిజ్రా క‌ర్పూరం పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంది. సినిమాలో బ్ర‌హ్మానందంతో క‌ర్పూరం చేసిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించింది. అంతే కాకుండా క‌ర్పూరం కాల్పుల్లో గాయ‌ప‌డినప్పుడు ఉండే ఎమోష‌నల్ సన్నివేశం ప్రేక్ష‌కులను క‌న్నీళ్లు పెట్టించింది.

ఇక పాత్ర‌లో న‌టించింది ఎవ‌రు అన్న సంగ‌తి మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి క‌ర్పూరం పాత్ర‌ను ద‌ర్శ‌కుడు క్రిష్ చేయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ క్రిష్ త‌ల్లి ఆ పాత్ర చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించిందట‌. అయితే అదే స‌మ‌యంలో అనుష్క త‌న మేకప్ ఆర్టిస్ట్ నిక్కి ఫోటోల‌ను క్రిష్ కు చూపించార‌ట‌. క‌జ్ రారే పాట‌కు నిక్కి చేసిన డ్యాన్స్ వీడియోను కూడా క్రిష్ కు చూపించార‌ట‌. ఆ వీడియో చూసి క‌ర్పూరం పాత్ర‌కు నిక్కి సూట్ అవుతుంద‌ని వెంట‌నే ఓకే చెప్పార‌ట‌.

Also Read: నంబ‌ర్- 1 పులిహోర రాజా…యాంక‌ర్ శివ‌పై అష్షు రెడ్డి దారుణమైన కామెంట్లు..!

Visitors Are Also Reading